Did not support Modi on Rafale deal: Sharad Pawar రాఫెల్ డీల్ పై శరద్ పవార్.. యూటార్న్..

Rafale deal no question of backing govt says sharad pawar

rafale deal, sharad pawar, pm modi, amit shah, dassault aviation, congress, ncp, rafale scam, Rahul Gandhi, Politics

Facing accusations of ‘defending’ PM Modi over alleged irregularities in the Rafale deal, NCP president Sharad Pawar launched a scathing offensive against the Modi government over the controversy.

నోరు జారీ నాలుక ఖర్చుకున్న శరద్ పవార్.. యూటార్న్..

Posted: 10/02/2018 07:44 PM IST
Rafale deal no question of backing govt says sharad pawar

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీ చిత్తశుద్ధిని దేశ ప్రజలెవరూ శంకించడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన వ్యాఖ్యలను పవార్ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. 'నేను మోదీకి మద్దతుగా నిలిచానంటూ కొందరు విమర్శించారు. నేను మోదీని సపోర్ట్ చేయలేదు. ఆ పని చేయను కూడా' అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతంలో జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ  మేరకు వ్యాఖ్యానించారు.

రాఫెల్ యుద్ధ విమానాలను కొనాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని... అయితే ఒక్కో విమానం ధర రూ. 650 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు ఎలా పెరిగిందనే విషయాన్ని మాత్రం పార్లమెంటుకు కేంద్రం వివరించాలని పవార్ అన్నారు. ఈ ఒప్పందంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. 36 ఫైటర్ జెట్స్ కు కొనుగోలుకు సంబంధించిన మొత్తం ఒప్పందం విలువ ఎంతో బయటపెట్టాలని కోరారు.

మోదీకి అనుకూలంగా పవార్ వ్యాఖ్యలు చేసిన తర్వాత... కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మీ కూటమి సభ్యుడు పవార్ కూడా వాస్తవాలు మాట్లాడుతున్నారని... మీరు కూడా వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ హితవు పలికారు. రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని... ఈ విషయంలో పవార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని బీజేపీ అధినేత అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా పవార్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో... ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rafale deal  sharad pawar  pm modi  amit shah  dassault aviation  congress  ncp  rafale scam  Rahul Gandhi  Politics  

Other Articles