viral: shirdi sai image in moon నెట్టింట్లో వైరల్: చందమామలో షిరిడి సాయి ప్రతిబింభం..

Shirdi sai moon whatsapp messages goes viral

shirdi sai image in moon, shirdi sai images viral, shirdi sai images viral online, shirdi sai images social media, Shirdi Sai Baba, sai baba image, Moon, Whatsapp, social media, Messages

The image of Shirdi Sai Baba appearing in the moon has become a sensation in Andhra Pradesh. The news has become viral as people starting sharing image on Whatsapp and other social media platforms

ITEMVIDEOS: నెట్టింట్లో వైరల్: చందమామలో షిరిడి సాయి ప్రతిబింభం..

Posted: 09/24/2018 01:37 PM IST
Shirdi sai moon whatsapp messages goes viral

భక్తుల భక్తివిశ్వాసాలతో పరఢవిల్లే ధర్మభూమి భారత్. తమ కర్మఫలమైనా.. అది భగవంతుడి దయే అని బావించే భక్తులకు కరువు లేదిక్కడ. ఇక ప్రస్తుతం అటు భక్తుల సంఖ్యతో పాటు ఆదాయ అర్జనలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడితో పోటీ పడుతన్న దైవం షిరిడీ సాయినాథుడు అని చెప్పడంలో సందేహమే లేదని ప్రతీ ఏడు భయటకు వస్తున్న గణంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో షిరిడి సాయికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.

ఎక్కడా అంటే ఇటు అంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో గత రెండు రోజులుగా సాయిబాబా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు.. రాత్రైతే చాలు ఆకాశం వైపు చూస్తూ.. తీక్షణంగా చంద్రుడిని వీక్షిస్తున్నారు. ఎందుకని చీకటి పడగానే చంద్రుడిపైపు చూస్తున్నారనేగా మీ సందేహం.? చంద్రుడిలో షిరిడి సాయిబాబా ప్రతిబింభం కనిపిస్తుందన్న వార్తలు తెలుగురాష్ట్రాల ప్రజలకు తెలియడమే ఇందుకు కారణం. ఔనా నిజమేనా అంటూ చీకటి పడగానే చంద్రుడిపై తీక్షణంగా చేస్తూ.. సాయి నామస్మరణ చేసుకుంటున్నారు సాయిభక్తులు.

ఇప్పుడీ వార్త వాట్సాప్ తో సహా అన్ని సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారి.. సంచలనంగానూ మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సాయి భక్తులు అమితంగా షేర్ చేసుకుంటున్నారు. దీంతో సాయి భక్తులు, ఆకాశం వైపు చూస్తూ చంద్రుడిలో సాయి నీడను వెతుకుతున్నారు. పలు ప్రాంతాల్లో చంద్రుడి వెన్నెలలో మహిళా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు. ఈ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి కావచ్చని, గతంలోనూ ఇటువంటి చిత్రాలు వైరల్ అయ్యాయని హేతువాదులు చెబుతున్నప్పటికీ, వినే పరిస్థితిలో ఎవరూ లేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shirdi Sai Baba  sai baba image  Moon  Whatsapp  social media  Messages  

Other Articles

Today on Telugu Wishesh