Right to protest at Dharna Chowk restored టీఆర్ఎస్ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్..

Why govt mum on dharna chowk for over a year hyderabad hc

TRS Govt, Telangana Government, Hyderabad High Court, Dharna Chowk, Indira Park, NTR Garden, Shamshabad, Medchal, Ghatkesar, Hyderabad, telangana, politics

The Hyderabad High Court issued interim orders restoring the right of agitators to protest at the ‘Dharna Chowk’. The court, however, directed the government to file a counter within two days.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. ధర్నాచౌక్ పునరుద్దరణ ఉత్తర్వులు

Posted: 09/19/2018 03:54 PM IST
Why govt mum on dharna chowk for over a year hyderabad hc

రాష్ట్రంలోని అపధర్మ ప్రభుత్వం అలక్ష్యంపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంటూ న్యాయస్థానం ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్ ను పునరుద్దరించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాదులో వున్న ధర్నా చౌక్ ను ఎత్తివేయడంపై ఏఢాది కాలంగా ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడానికి తాత్సారం చేసిందని రాష్ట్రోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

ప్రజాస్వామ్య దేశంలో పౌరులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా వుంటుందని ఇద్దరు సభ్యులతో కూడిన హైకార్టు ధర్మాసనం పేర్కోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించ వచ్చని... కానీ, పూర్తిగా అణచివేయరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ లతో కూడిన రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎక్కడో నగరం వెలుపల ధర్నా చేస్తే... వారి అవేదనను, అభ్యర్థనను ఎవరు వింటారని, ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించింది.

ఈ సందర్బంగా ఓ ఉదాహరణను కూడా జోడించిన న్యాయస్థాన ధర్మాసనం.. అడవిలో మనుషులు నివసించని చోట సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తారా? అని ఎద్దేవా చేసింది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను పునరుద్దరించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ధర్నా చౌక్ ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు మాట్లాడుతూ, శాంతిభద్రతల కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. ఏడాది నుంచి గడువు కోరుతూనే ఉన్నారని... ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువును ఇచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana Government  Hyderabad High Court  Dharna Chowk  telangana  politics  

Other Articles