police foils gataiah family suicide attempt గట్టయ్య కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత

Police foils gataiah family suicide attempt

gattaiah family members suicide attempt, gattaiah family suicide attempt, gattaiah family gas leak, TRS shock, shock to TRS, TRS chennur Mla, nallala odelu, peddapalli MP, Balka Suman, Gattaiah, sucide attempt, chennur, KCR, TRS, telangana, politics

Another twist after TRS MLA nallala odelu follower gattaiah death, his family, wife and children also attempted suicide, police sponteanous action save the lives, after TRS activist who died in yashoda hospital, after attempted suicide demanding chennur seat to sitting mla,

గట్టయ్య కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత

Posted: 09/19/2018 03:23 PM IST
Police foils gataiah family suicide attempt

తెలంగాణలోని చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ.. ఆ టికెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఇందారం గ్రామంలో ప్రచారానికి వచ్చిన బల్కా సుమన్ సమావేశాన్ని అడ్డుకున్న గట్టయ్య.. అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకే టికెట్ కేటాయించాలని అదే సభలో ఈ నెల 12న వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు గట్టయ్య.

60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న గట్టయ్యను తొలుత మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పెట్రోల్ కావడంతో నిప్పు అంటగానే భగ్గుమని మంటలు వ్యాపించి.. శరీరం చాలా వరకు గాయాలపాలు కావడంతోనే గట్టయ్య మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి.

ఇదిలావుండగా, గట్టయ్య అంత్యక్రియలకు బాల్క సుమన్; నల్లాల ఓదేలు రావాలని డిమాండ్ చేస్తూ ఆయన కుటుంబసభ్యులు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా మంచిర్యాలలోని ఇందారంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి గడియ పెట్టుకున్న.. గట్టయ్య భార్య, పిల్లలు గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నానికి సిద్దం అవుతుండగా, వెంటనే పసిగట్టిన పోలీసులు తలుపులు బద్దలు కోట్టి వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అయితే గట్టయ్య కుటుంబాన్ని అన్ని విధాటుగా అదుకుంటామని పోలీసులు వారికి హామి ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  shock to TRS  nallala odelu  Balka Suman  Gattaiah  Gattaiah family  chennur  KCR  TRS  telangana  politics  

Other Articles