Petrol and diesel prices hiked again వాహనదారులకు ఇవాళ కూడా తప్పని వడ్డన..

Petrol and diesel prices hiked again

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

వాహనదారులకు ఇవాళ కూడా తప్పని వడ్డన..

Posted: 09/18/2018 01:04 PM IST
Petrol and diesel prices hiked again

చమురు సంస్థలు మళ్లీ వడ్డించేశాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం అవుతున్నా.,. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఇంధన సంస్థలు అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో తమ చేతుల్లో ఏమీ లేదన్న వైనాన్ని ప్రదర్శిస్తూ.. వడ్డింపులు మాత్రం జరుగుతుంటాయని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన సమయంలో వాటిపై ఎక్సైజ్ డ్యూటీని విధించి తగ్గింపును వాహనదారులకు వర్తించకుండా అడ్డకున్న కేంద్రం కూడా.. తామేమి చేయలేమన్న ధోరణని అవలంభిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరగడంతో అదే స్థాయిలో మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ధరలు పెరిగిన ప్రతీసారి చెప్పే అదే అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపిస్తున్నాయి. శతకం వైపు పరుగులు తీస్తున్న ఇంధన ధరలను కట్టడి చేయడంలో విఫలమైన కేంద్రం.. కనీసం తగు చర్యలు తీసుకోవడంలోనూ విఫలమైందన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సామాన్య ప్రజానీకం డిమాండ్ చేస్తోంది. ధరలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నా.. పట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్రం ఉదాసిన వైఖరితో.. ఇంధన సంస్థలు తాజాగా ఇవాళ మళ్లీ వాహనదారులకు వడ్డించేశాయి. ఇవాళ తాజా వడ్డనతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.82.16కు చేరగా...డీజిల్ రూ.73.87కు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.89.54కు చేరగా...డీజిల్ రూ.78.42కు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ రూ.83.91, డీజిల్ రూ.75.53, చెన్నైలో పెట్రోల్ రూ.85.31, డీజిల్ రూ.78గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles