Sub Inspector beats wife, infant, mother-in-law ప్రేమించి పెళ్లి.. మోజు తీరగానే మరో మహిళతో..

Si beats wife infant mother in law after his affair is revealed

Parveen, Jitendra, Sub Inspector, Manuguru, Bhadradri Kothagudem district, divorce, domestic violence, crime

A Sub Inspector (SI) from Telangana brutally thrashed up his wife, baby and mother in law after his extramarital affair came to light. The SI later disappeared along with his paramour. His attack on the family members was caught on camera.

ప్రేమించి పెళ్లి.. మోజు తీరగానే మరో మహిళతో..

Posted: 08/31/2018 06:04 PM IST
Si beats wife infant mother in law after his affair is revealed

భార్యను చేరదీయకుండా దూరంగా ఉంచడంతో ప్రశ్నించినందుకు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా మణుగూరు ఎస్సై సముద్రాల జితేందర్‌.. తన భార్య పర్వీన్‌, అత్త తహెరాలను చితకబాదిన ఉదంతమిది. బాధితురాలు పర్వీన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌ మొగిళ్లపాడు గ్రామానికి చెందిన ఎస్సై జితేందర్‌ 2015లో వెంకటాపురంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పాల్వంచకు చెందిన తనను ప్రేమించాడు. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన తాను కూడా సమ్మతి తెలపడంతో.. ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపింది.

పెళ్లయిన వారం రోజుల నుంచే తనను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. వేధింపుల గురించి ఎవరికీ చెప్పవద్దని కూడా భార్యను బెదిరించాడు. పెళ్లయిన కొన్ని రోజులకు మొదటి సారి గర్భం దాల్చిన పర్వీన్ కు అబార్షన్‌ చేయించాడు. చింతకాని నుంచి కొత్తగూడెంకు బదిలీ అయిన సమయంలో పుట్టింటికి వెళ్లమని పంపించాడు. ఆ తరువాత కొత్తగూడెంలోని ఓ అధికారి ఇంటికి భార్యను పిలిపించి రూ.50 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు.

రెండోసారి గర్భం దాల్చిన సమయంలో మళ్లీ అబార్షన్‌ చేయించుకోమని వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఏడాదిగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పర్వీన్‌ ఫోన్‌ చేసినా స్పందించేవాడు కాదు. పది నెలల కిందట కుమారుడు జన్మించినా ఇప్పటివరకు బాబును ఒక్కసారి కూడా చూడలేదు. భార్య నుంచి విడాకులు కావాలని పదే పదే అడిగేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంవల్లే తనను దూరంగా ఉంచుతున్నాడన్న విషయం తెలిసింది.

ఈ విషయంపై బంధువులు జితేందర్ ను నిలదీయగా వారిపై దాడికి దిగాడని పర్వీన్‌ వాపోయారు. మణుగూరులో ఎస్సై నివాసానికి పర్వీన్‌, అత్త తహెరా వెళ్లి జితేందర్ ను నిలదీయగా వారిని విచక్షణారహితంగా కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పర్వీన్‌, తహెరాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు మణుగూరు సీఐ కొండ్ర శ్రీనివాస్ కు పర్వీన్‌ ఫిర్యాదు చేశారు. సంఘటనపై మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబాను వివరణ కోర¢గా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్ పై కేసు నమోదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parveen  Jitendra  Sub Inspector  Manuguru  Bhadradri Kothagudem district  divorce  domestic violence  crime  

Other Articles