Karunanidhi: Twitter tributes from President, PM and celebrities కరుణానిధి మృతికి ప్రముఖుల సంతాపం..

Karunanidhi twitter tributes from president pm and other political leaders and celebrities

M Karunanidhi, Karunanidhi passes away, Karunanidhi no more, Karunanidhi dies at 94, Karunanidhi death, M Karunanidhi, Kauvery Hospital, Kalaignar, dmk, stalin, CM Palanisamy, President Ramnath Kovind, PM Modi, Governer Narasimhan, Delhi CM Kejriwal, Andhra CM, Chandrababu Naidu, Telangana CM, KCR, Yashwant Sinha, Rajini kanth, Kamal hassan, pawan kalyan, YS Jagan, Radhika, sharatkumar, tamil nadu

After the sad demise of DMK president Karunanidhi, several political leaders including President Kovind, PM Modi, Governer Narasimhan, Delhi CM Kejriwal, Andhra CM Naidu, Telangana CM KCR, Yashwant Sinha and other celebrities offered condolences.

కరుణానిధి మృతికి ప్రముఖుల సంతాపం..

Posted: 08/08/2018 10:56 AM IST
Karunanidhi twitter tributes from president pm and other political leaders and celebrities

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై దేశంలోని ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కళైంజ్ఞర్ కరుణకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం.. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని గవర్నర్ నరసింహన్ అన్నారు. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.

దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాహిత్యం, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని, నిరుపేదలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన నిత్యం పరితపించారని అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ప్రకటనలో కరుణానిధి మృతి పట్ల ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణానిధి అని, దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

ఇటు అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ కరుణానిధి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన తుదిశ్వాస విడవడం విషాదంలో ముంచిందని అన్నారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడైన ‘కలైంగర్’ కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించానని, వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాక యావత్ దేశానికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తీరనిలోటని పేర్కోన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

తమిళనాడు రాజకీయాలే కాదు భారత రాజకీయ చిత్రంపై కరుణానిధి ముద్ర బలంగా ఉందని అన్నారు. రచనా వ్యాసంగం నుంచి రాజకీయ యవనిక పైకి వచ్చిన కలైంగర్ గానే తమిళుల హృదయాల్లో ఆయన నిలిచారంటే తమిళ సాహిత్యంపై వారి ప్రభావం ఎంత ఉన్నతమైనదో తెలుస్తుందని అన్నారు. రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా కరుణానిధి వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికి, భావి తరాలకు చిరస్మరణీయాలని పవన్ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

అటు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కరుణానిధి మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’ గా రజనీ అభివర్ణించారు. ఈ  బ్లాక్ డేను తాను ఎప్పుడూ మర్చిపోలేనని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. కరుణానిధి అస్తమయంతో తమిళ కళాకారులు కూడా స్పందించారు. వారికి కళైంజ్ఞర్ తో ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని ప్రముఖ నటి రాధిక అన్నారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారని, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నానని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు.

కరుణ మృతిపై ప్రముఖ నటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ స్పందించారు. కరుణ మృతి తమిళనాడుకి తీర్చలేని లోటు అని ఆయన అన్నారు. ‘‘గత 75 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించిన ఓ మహానేత ఆయన. ఇంతటి మహానేత ఇంతకు ముందు, ఇకపై ఎన్నడూ మనకి దొరకరు. అయన మరణం ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రంలో ఉన్న తమిళులకి తీరని లోటు. ఆయన కుటుంబానికి, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

మరోనటి  హన్సిక స్పందిస్తూ, కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ స్పందిస్తూ, నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని తన ట్వీట్ లో చెప్పింది. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేసింది.  

కాగా, కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానలు విషాదంలో మునిగిపోయారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల అంక్షలు వున్న నేపథ్యంలో వారిని రాజాజీ హాలు వద్దకు మళ్లించారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M Karunanidhi  Kauvery Hospital  Kalaignar  dmk  stalin  twitter tributes  tamil nadu  

Other Articles