ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆయన ఇవాళ అసుపత్రికి వెళ్లడాన్ని గమనించిన కొందరు ఇదే విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా తమ స్నేహితులతో పంచుకున్నారు. అంతే అలా వెనువెంటనే ఈ వార్త దవానంలా వ్యాపించి.. చివరకు ఆయన అధికార ప్రతినిధి స్పందించి.. వివరణ ఇచ్చేలా చేశారు.
మణిరత్నంకు గుండె పోటు వచ్చిందని.. ఇవాళ మధ్యాహ్నం ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారని ప్రచారం జోరందుకుంది.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు మణిరత్నాన్ని హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారని, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోందని సోషల్ మీడియా ఒక్కసారిగా కొడై కూసింది. దీనిపై మణిరత్నం స్పోక్స్ పర్శన్ నిఖిల్ మురుగన్ స్పందిస్తూ.. ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే జరిగిందని, ఇందులో అందోళన పడాల్సిన విషయమేమీ లేదని తెలిపారు. మణిరత్నం ఆరోగ్యంపై వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
మణిరత్నం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నిఖిల్ మురుగణ్ తెలిపారు. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆయన అపోలో హాస్పిటల్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు. మణిరత్నం క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఈ సమాచారంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా మణిరత్నం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్ధితులపై అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమణి ప్రముఖ నటి సుహాసినికి కూడా పలువురు ఫోన్ ద్వారా క్షేమసమాచారం కనుక్కున్నారని తెలుస్తుంది.
మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు పట్టం కట్టిన చిత్రాలు అనేకం వున్నా.. తెలుగులో గీతాంజలి, రోజా, నాయుకుడు, బొంబాయి, యువ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించాయి. నేటి తరం దర్శకులు కొందరు ఆయన ఆణిముత్యాల్లాంటి చిత్రాల నుంచి స్ఫూర్తి పొందుతారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం తమిళంలో ఆయన ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అథితి రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదల కాబోతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more