SSC Constable Recruitment for 54953 posts భారీ సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు..

Ssc constable recruitment 2018 registration for 54953 posts

SSC GD constable recruitment, SSC GD constable recruitment 2018, Staff Selection Commission, SSC, Constable General duty, GD, Border Security Force, Central Industrial Security Force, Central Reserve Police Force, Indo-Tibetan Border Force, Sahastra Seema Bal, National Investigation Agency, Secretariat Security Force, CRPF, Jobs, Career, SSC jobs, Sarkari naukri

Candidates will be selected on the basis of Computer Based Test (CBE), Physical Efficiency Test (PET), Physical Standard Test (PST) and Medical Examination.

భారీ సంఖ్యలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు..

Posted: 07/23/2018 01:03 PM IST
Ssc constable recruitment 2018 registration for 54953 posts

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది. మరీ ముఖ్యంగా ఎలాగైనా సర్కారీ నౌకరీ దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న యువతతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న వారికి భారీ స్థాయిలో ఉద్యోగ నియామాకాలు చేపడుతున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ప్రకటనను వెలువరించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో పోస్టుల భర్తీని ఈ భారీ నోటిఫికేషన్‌ తో చేపట్టనుంది.

కానిస్టేబుల్‌ (జీడీ), రైఫిల్‌మెన్‌ (జీడీ) విభాగాల కింద మొత్తం 54,953 ఖాళీలు ఉన్నాయి. వీటిలో పురుషులకు 47,307, మహిళలకు 7,646 పోస్టులను కేటాయించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్ )లో 21,566 పోస్టులతో పాటు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్ఎఫ్‌), సహస్త్ర సీమా బల్‌ (ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), అసోం రైఫిల్స్‌(ఏఆర్‌), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ల్లో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులను కాంప్యూటర్ బేస్ట్ టెస్టులతో ఎంపిక చేయనున్నారు. టెస్టు తో పాటు శారీరిక ధృడత్వం పరీక్ష, మెడికల్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఆగస్టు 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్ సీ సూచించింది. ముందుగా 21వ తేదీ నుంచీ ఈ ఉధ్యోగాలకు అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఎస్ఎస్ సీ తరువాత పలు సాంకేతిక కారణాల ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మంగళవారం విడుదల అవుతుందని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles