'Lover' hacks woman on street with sickle యువతి పై వేట కొడవలితో ప్రేమోన్మాది దాడి

Lover hacks woman on street with sickle

Tamilnadu Trajedy,Love Affair,Boy Attacks Girl For Rejecting His Love Proposal in Tamilnadu,Boy Attacks Girl For Rejecting His Love Proposal,Attacks Girl For Rejecting His Love Proposal,Rejects Love Proposal,Tamlnadu Politics,Rajaplem Incident,Boy Attaks Girl in Rajapalem,Rajapalem Sensational Attacking News,Rajapalem,Tamilnadu, Crime

In a shocking incident, a video has gone viral on social media, A man hacks her lover with sickle in rajapalem area of Tamil Nadu In a broad day light, but no one came to her rescue.

ITEMVIDEOS: నడిరోడ్డుపై వేటకొడవలితో ప్రేమోన్మాది దాడి.. యువతి సీరియస్

Posted: 07/06/2018 12:51 PM IST
Lover hacks woman on street with sickle

తమిళనాడులో మరో దారుణం జరిగింది. ఆ మధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిపై యువతి తాలుకు బంధువులు వచ్చి జనసామార్థ్యం వున్న రోడ్డుపై వారిని అటకాయించి వేటకొవళ్లతో దారుణంగా హతమార్చుతున్నా.. మనిషన్నవాడే మాయమై.. మనస్సన్నదే లేకుండా ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న నాథుడే కరువవ్వవడంతో ఆ దళిత యువకుడు అక్కడికక్కడే మరణించగా, యువతి మాత్రం తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటనపై అలస్యంగా తేరుకున్న మానవ సంఘాలు పోరాటం ప్రారంభించాయి.

తాజాగా గత నెల 20న అదే తమిళనాడులోని రాజపాలెంలో ఓ యువతిపై ప్రేమోన్మాది వేటకొడవలితో నరికి చంపి తాపీగా వెళ్లినపోయాడు. ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. రాజపాలెం ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో వున్న సిసిటీవీ ఫూటేజీ ఈ ఘటనను తనలో నిక్షిప్తం చేసింది. ఆ ఘటన తాలుకు వీడియో వెలుగుచూడటంతో మానవత్వం మచ్చకైనా లేదా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తాను ప్రేమించిన యువతి ఎప్పడెప్పుడు బయటకు వస్తుందా.? అంటూ అక్కడే మాటు వేశాడు ప్రేమోన్మాది.

ఆమె బయటకు రాగానే అమెను వెంబడించాడు. అతని నుంచి పారిపోయే క్రమంలో యువతి కింద పడిపోయింది. అంతే అదే అదనుగా భావించిన ప్రేమోన్మాది తన వెంట తెచ్చుకున్న సంచిలోంచి వేటకొడవలి తీసి అమె మెడపై దాడి చేశారు. ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా నాలుగైదు సార్లు అదేపనిగా అమె మెడపై నరికాడు. ఇక తన కత్తిని బ్యాగులో పెట్టుకని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు కానీ తేరుకోని స్థానికులు అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేసే లోపు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మనుషుల్లో మాయమౌతున్న మానవత్తాన్ని ఎత్తి చూపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love affair  lover hacks woman  sickle  cctv footage  rajapalem  tamilnadu  Crime  

Other Articles