naresh gujral nda's deputy chairman candidate రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఐకే గుజ్రాల్.?

Naresh gujral might be nda s deputy chairman candidate

Naresh Gujral, Rajya Sabha, Venkaiah Naidu, shiromani akali dal, odisha, deputy chairman, west bengal, mamta banerjee, biju janata dal, rajya sabha deputy chairman, deputy chairperson, deputy chairman election, bjp, rajya sabha, rajya sabha deputy chairman election, kj kurien, congress

The name of senior Akali Dal Member of Parliament Naresh Gujral is doing the rounds. This might help the BJP swing majority in its favour by getting support from parties like the Biju Janata Dal, which hold the key.

రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఐకే గుజ్రాల్.?

Posted: 07/02/2018 02:21 PM IST
Naresh gujral might be nda s deputy chairman candidate

త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఎగువ సభలో బీజేపీ పెద్ద పార్టీయే అయినా, డిప్యూటీ ఛైర్మన్‌ను గెలిపించుకోడానికి అవసరమైనంత మెజార్టీ లేకపోవడంతో తమ పార్టీకి చెందిన అభ్యర్థిని నేరుగా రంగంలోకి దింపేందుకు మాత్రం వెనకడుగు వేస్తుంది. ఇదే క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. తమ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేతను ఈ పదకి కోసం రంగంలోకి నిలబెట్టాలని కాషయదళం యోచిస్తుంది. ఈ అభ్యర్థికి అదనంగా కలిసోచ్చి అంశాల్లో ఆయన మాజీ ప్రధాని తనయుడు. ఇంతకీ ఎవరాయన.? అంటే..

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ తనయుడు నరేష్ గుజ్రాల్ ను బరిలోకి దింపాలని బీజేపి భావిస్తుంది. రాజ్యసభ ఉపాధ్యాక్షుడు పీజే కురియన్ పదవీ కాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోకోవాలని పావులు కదుపుతోంది. తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో ఎన్డీయే తరఫున శిరోమణి అకాలీదళ్‌కు చెందిన నరేష్ గుజ్రాల్‌ పేరును ఖరారుచేసినట్టు సమాచారం. మిత్ర పక్షానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలిపితే, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో నరేష్ గుజ్రాల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 1948, మే 19న జలంధర్ లో జన్మించిన నరేష్ గుజ్రాల్, పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు పీజే కురియన్ పదవీ కాలం ముగియడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కెలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. డిప్యూటీ ఛైర్మన్ ఎంపికలో అధికార, విపక్షాలు కలిసి కురియన్ లాంటి సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ సభ డిప్యూటీ చైర్మన్‌గా మాజీ ప్రధాని తనయుడు గుజ్రాల్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జనతాదళ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అలాగే తటస్థంగా ఉన్న బీజేడీ లాంటి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కూడా యూపీఏ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం యూపీఏ మిత్రపక్షాలతోపాటు మిగతా పార్టీలను సంప్రదించి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అందులో భాగాంగానే తృణమూల్‌ పార్టీకి చెందిన ఎంపీని నిలబెట్టే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naresh Gujral  Rajya Sabha  Venkaiah Naidu  shiromani akali dal  odisha  Deputy Chairman  

Other Articles