Shiv Sena attacks BJP over Emergency కాంగ్రెస్ కు జంకే.. ఇందిరా ఎమర్జెన్సీ గుర్తుచేస్తున్న బీజేపీ

Indira gandhi s role can t be written off due to emergency shiv sena

Shiv Sena, Sanjay Raut, Indira Gandhi, bharatiya janata party, congress, rahul gandhi, Kashmir, Nirav Modi, Army, Haji Mastan, Hindustan, Ramzan, Vijay Mallya, Emergency, demonetization, corruption, politics

Attacking the NDA government at the Centre, the Shiv Sena said while the BJP was criticising late prime minister Indira Gandhi for declaring an Emergency in 1975, the country has seen similar 'black days' during PM Modi's regime since four years.

కాంగ్రెస్ కు జంకే.. ఇందిరా ఎమర్జెన్సీ గుర్తుచేస్తున్న బీజేపీ: శివసేన

Posted: 07/02/2018 01:35 PM IST
Indira gandhi s role can t be written off due to emergency shiv sena

గత ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ అని, అవినీతి రహిత పాలన అని, 56 ఇంచుల ఛాతి అని, నల్లధనంమని, నిత్యావసర సరుకులు ధరలని ఎన్నో ఎన్నోన్నో హామీలను ఇచ్చి.. అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన బీజేపి పార్టీ.. తాము నాలుగేళ్ల అధికారంలో ఏమి చేశామో చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఇందిరాగాంధీ తన హయాంలో విధించిన ఎమర్జెన్సీని ఈ సారి ప్రచారంగా వాడుకుంటుందని మిత్రపక్షం శివసేన విమర్శలు గుప్పించింది. 1975 నాటివి ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమేనని, అయితే ప్రస్తుతం మీరేం చెప్పారు..? ఎం చేస్తున్నారని శివసేన ప్రశ్నించింది.

1975లో ఉత్పన్నమైన రాజకీయ సమస్యలతో దేశం అస్తవ్యస్థంగా మారడంతో.. గత్యంతరం లేని పరిస్థితులో అమె ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయం ఎమర్జెన్సీ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో విశ్వసించారు.. కాబట్టే దేశం అతలాకుతలం కాకుండా రాజ్యంగబద్దంగా అమె నిర్ణయం తీసుకున్నారని అయన అన్నారు. ఈ ఒక్క నిర్ణయం కారణంగా ఇందిరని విమర్శించడం తగదని... దేశానికి ఆమె చేసిన సేవలను ఎలా విస్మరిస్తామని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.

దేశానికి ఎంతో చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువ చేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు. దేశానికి ఇందిర చేసినంత గొప్పగా మరెవరూ చేయలేకపోయారని అభిప్రాయపడ్డారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఆమెపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుందని.. అది కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు.

ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని చెప్పారు. నోట్ల రద్దుతో ఎంతో మంది సామాన్యులు కొన్ని రోజుల పాటు ఉపాధిని కోల్పోయారని విమర్శించారు. చిన్నచిన్న వ్యాపారులు ఎంతో నష్టపోగా, డబ్బు కోసం క్యూలలో నిలబడిన ఎంతో మంది వయోవృద్ధులు ప్రాణాలను కోల్పోయారని మండిపడ్డారు.అయితే నల్ల కుబేరుల డబ్బు మాత్రం వైట్ గా మారిందని దుయ్యబట్టారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని మండిపడ్డారు. మరో బీజేపి మంత్రి డైరెక్టర్ గా వున్న బ్యాంకులోనూ సుమారు 500 కోట్ల రూపాయల రద్దైన నోట్లు డిపాజిట్ అయ్యాయని.. ఇలా దేశవ్యాప్తంగా వున్న లక్షలాధి బ్యాంకుల్లో ఎన్నో అక్రమాలు జరిగివుంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి దేశం ఇంకా బయటపడలేదని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ కు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని... కానీ, నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని రౌత్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వాణీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో బాధలను అనుభవించిన జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వారికి మాత్రమే... ఎమర్జీన్సీ తీవ్రత గురించి మాట్లాడే హక్కు ఉందని సంజయ్ రౌత్ చెప్పారు. ఆ సమయంలో ఫెర్నాండెజ్ జైలుకు వెళ్లడం మాత్రమే కాదు, ఇందిర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విప్లవాన్ని తీసుకొచ్చేందుకు కూడా విశ్వప్రయత్నం చేశారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పుట్టనివారు, బుడిబుడి అడుగులు వేస్తున్నవారు కూడా దాని గురించి మాట్లాడుతుండటం బాధాకరమని చెప్పారు. తాను ఎమర్జెన్సీని సపోర్ట్ చేయడం లేదని ఇదే సమయంలో వ్యతిరేకించడం లేదని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో సివిల్ సర్వీసెస్ అధికారులు సమయానికి కచ్చితంగా కార్యాలయాలకు వచ్చేవారని, పరిపాలన సక్రమంగా జరిగిందని రౌత్ చెప్పారు. పేరుమోసిన డాన్లు హాజీ మస్తాన్, కరీమ్ లాలా, యూసుఫ్ పటేల్, వరదరాజన్ లాంటి వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో కటకటాలు లెక్కపెట్టారని... ఇప్పుడు కోట్లు కొల్లగొట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారని దుయ్యబట్టారు.

అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని గట్టెక్కించేందుకే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారని రౌత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరి మానసికి స్థితికి వీరి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. వారు చేసిన అభివృద్ధి గురించి బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవాలని... 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Sanjay Raut  Indira Gandhi  bjp  congress  gujarat model  demonetisation  politics  

Other Articles