young Girls Caught In Drunk and Drive Test డ్రంక్ అండ్ డ్రవ్ లో అడ్డంగా బుకైన యువతులు..

Young girls caught in drunk and drive test at jubilee hills

young girls in drunk and drive, drunk and drive test, drunk and drive test at jubilee hills, young girls, drunk and drive, jubilee hills, traffic police, couselling, hyderabad, crime

Traffic police Conduct Drunk and Drive Test in Jubilee Hills and Files 19 Cases, 12 Cars and 7 bikes seized By police, Out of 19 Cases 3 girls Caught in drunk and test police to produce them in court after conselling.

ITEMVIDEOS: డ్రంక్ అండ్ డ్రవ్ లో అడ్డంగా బుకైన యువతులు..

Posted: 06/30/2018 10:43 AM IST
Young girls caught in drunk and drive test at jubilee hills

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తూ.. అడ్డంగా బుకైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన న్యాయస్థానంలో హాజరుపర్చుతున్న పోలీసులు.. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను పనంగా పెట్టరాదని పదే పదే విన్నవిస్తున్నా.. మద్యం ప్రియులు మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో అడ్డంగా బుకవుతున్నారు.

వారంతంలో పోలీసులు తనిఖీలు వుంటాయని పనిగట్టిన మద్యం ప్రియులు.. వారాంతాలలో కాకుండా మిగతా రోజుల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు. అయితే మద్యం ప్రియుల ఎత్తులకు పైఎత్తులు వేసే పోలీసులు క్రితం రోజు రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పలువురు యువతీ యువకులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వెళ్తున్న పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం 19 కేసులు నమోదు అయ్యాయి. 12 కార్లు, 7 బైకుల్ని పోలీసులు సీజ్ చేశారు. ఫుల్లుగా మందుకొట్టిన యువతులు....... డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారందరికీ కౌన్సిలింగ్ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : young girls  drunk and drive  jubilee hills  traffic police  couselling  crime  

Other Articles