వెండితెరపై వెలిగే హీరోలు.. నటులు తాము నిజ జీవితంలో కూడా హీరోలమేనని రుజువు చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తాము నిజజీవితంలో విలన్లమేనని చెప్పకనే చెబుతున్నారు. తాము హుందాగా వ్యవహరించి తమ అభిమానులను అదే దారిలో ఫాలో కావాలంటూ పిలుపునివ్వాల్సిన నటులు.. తాము చేసిన ప్రకటనలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ.. ట్రాఫిక్ రూల్స్ కానీ.. తాము చేసిన ప్రకటనలు కానీ తాము అచరించేందుకు కాదని తమ చర్యలతో తేల్చిచెబుతున్నారు.
గతేడాది సెప్టెంబరులో మద్యం తాగి కారు నడుపుతూ అడయారు బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొట్టిన యువ నటుడు జై మరోమారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేశారు. అంతకముందు 2014లో కేకే నగర్ సమీపంలోని కాశీ థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు. తాజాగా మరోమారు చెన్నయ్ లో తన అనుచిత ప్రవర్తనతో పోలీసులకు చిక్కాడు.
మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్డులో ఆగకుండా పెద్ద శబ్దంతో హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. దీంతో ఇతర ప్రయాణికులు హడలిపోయారు. పక్కనే ఆసుపత్రి ఉన్నప్పటికీ హారన్ మోతను ఆపకుండా సైరన్లా శబ్దం చేసుకుంటూ వెళ్లాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ధ్వని కాలుష్యంపై అతడికి అవగాహన కల్పించారు. జై క్షమాపణలు చెప్పడంతో హెచ్చరించి వదిలేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more