mahagathbandhan's door is closed for Nitish: Tejashwi లాలూను పరామర్శించిన నితీష్.. తేజస్వీ చురకలు..

Nitish kumar calls lalu prasad tejashwi dubs it late courtesy call

JD(U), Lalu Prasad Yadav, Nitish Kumar, RJD, Tejashwi Yadav, Rahul Gandhi, grand alliance, "mahagathbandhan", BJP, Bihar, politics

Bihar chief minister Nitish Kumar called up RJD national president Lalu Prasad, who is recuperating in a Mumbai hospital after undergoing a surgery two days ago, and enquired about his well-being.

లాలూను పరామర్శించిన నితీష్.. తేజస్వీ చురకలు..

Posted: 06/27/2018 10:01 AM IST
Nitish kumar calls lalu prasad tejashwi dubs it late courtesy call

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. తన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరామర్శించేందుకు నితీశ్ ఫోన్ చేశారని, అంతకుమించి ఇంకేమీ లేదని అన్నారు. అయితే తన తండ్రి అనారోగ్యంతో నాలుగు నెలలుగా బాధపడుతుంటే.. ఎన్డీయే ప్రభుత్వంలోని కేంద్రంమంత్రులు, బీజేపి ఎంపీలు అదివారం పరామర్శించిన తరువాత.. నితీష్ కు ఇప్పుడు తన తండ్రి గుర్తుకువచ్చారా.? అంటూ ఆయన చురకలంటించారు.

ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న తన తండ్రికి రెండు రోజుల క్రితం ఫిస్టులా ఆపరేషన్ జరిగిందని, ఆ విషయం తెలుసుకున్న నితీశ్, పరామర్శించేందుకు ఫోన్ చేసి మాట్లాడారని తేజస్వీ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే సమయంలో ఆయనపై కొన్ని విసుర్లూ వదిలారు. తన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, ఆ విషయం నితీశ్ కు తెలియడానికి నాలుగు నెలలు పట్టిందని వ్యంగ్యంగా ప్రశ్నించిన తేజస్వీ.. నితీష్ కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడో మూసుకున్నాయని, ఇక మహాగటబంధన్ తో అతను కలిసే అవకాశమే లేదని అన్నారు. ప్రస్తుతం లాలూ రు.

కాగా, ఎన్డీయేకి నితీశ్ దూరమవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్న వేళ, ఈ ఫోన్ సంభాషణ కొత్త రాజకీయ మలుపులకు సంకేతం కావచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలని నితీశ్ భావిస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము సిట్టింగ్ స్థానాలన్నింటిలో పోటీ చేయనున్నామని మిగిలిన తొమ్మిది స్థానాలను మాత్రమే జేడియుకు ఇస్తామని బీజేపి నేతలు ప్రకటనల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య కొంత దూరం పెరుగుతుందని వార్తలందుతున్నాయి.

బీజేపీతో కలిస్తే బీహార్ రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని నితీశ్ కుమార్ కన్న కలలు కల్లలుగానే మిగిలాయని, తన ఆలోచన భ్రమగా మిగిలిపోవడంతో, ఇప్పుడాయన తిరిగి మహాకూటమి వైపు చూస్తున్నారని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. నితీశ్ వ్యూహాలు బెడిసికొట్టాయని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆయన సాధించలేకపోయారని ఆరోపించారు. హోదా కాదు కదా, కనీసం ప్యాకేజీని కూడా తేలేదని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ విశ్వసనీయత కోల్పోయారని, మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటే, కొంతకాలం తరువాత ఆయన మళ్లీ బయటకు వెళ్లరన్న నమ్మకం తమకు లేదని, ఆయనకు తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయని తేజస్వీ యాదవ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JD(U)  Lalu Prasad Yadav  Nitish Kumar  RJD  Tejashwi Yadav  BJP  Bihar  politics  

Other Articles