Telangana to have 7 zones, 2 multi zones తెలంగాణకు 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు

Telangana to have 7 zones 2 multi zones for employees recruitment

Telangana, employment, recruitment, zonal system, Kaleshwaram, Basara, Rajanna, Bhadradri, Yadadri, Charminar, Jogulaamba, multi zonal system, yadadri, charminar, jogulamba, kaleshwaram, basara, rajanna, bhadradri, employee union, Telangana Government, KCR

Telangana State government has decided to form seven zones and two multi-zones for the benefit of employees in the State. A decision to this effect was taken by Chief Minister K Chandrashekar Rao

జోన్ల వ్యవస్థపై ముసాయిదా.. రమారమి ఒకే చెప్పిన సీఎం

Posted: 05/24/2018 03:48 PM IST
Telangana to have 7 zones 2 multi zones for employees recruitment

రాష్ట్రంలో కొత్తగా ఏడు జోన్లు.. రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాన ఉద్యోగ సంఘాల నేతల అధ్వర్యంలో ముసాయిదాను రమారమి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అమోదించారని సమాచారం. ఇవాళ ప్రగతి భవన్ లో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా.. ఇక చిన్న జిల్లాల ప్రజలకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు అధిక ప్రయోజనం చేకూర్చేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన అన్యాయాలకు అస్కారం లేకుండా ఈ వ్యస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.

 జోన్లు – జిల్లాల వివరాలు ఇలా :

* కాళేశ్వరం జోన్- భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి (28.29 లక్షల జనాభా)
* బాసర జోన్- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల (39.74 లక్షల జనాభా)
* రాజన్న జోన్ –కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ (43.09 లక్షల జనాభా)
* యాదాద్రి జోన్-సూర్యపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ (45.23లక్షల జనాభా)
* భద్రాద్రి జోన్-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్(50.44 లక్షల జనాభా)
* జోగులాంబ జోన్-మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ (44.63 లక్షల జనాభా)
* చార్మినార్ జోన్-  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి (1.03 కోట్ల జనాభా)

మల్టీజోన్లు

మల్టీజోన్లు-1-యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)
మల్టీజోన్లు-2-కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి  (1.61 కోట్ల జనాభా)

రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియచేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టీజీవో భవన్ లో సమావేశం జరుగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపుతారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles