200 kg of chits seized in class 12 exam centre in gujarat పరీక్ష కేంద్రం నుంచి 200 కిలోల చీట్టీలు..

Gujarat model 200 kg of chits seized in class 12 exam centre

Mass Copying, gujarat model, ahmedabad, class 12 exam, board exams, 200 kilo chits, 20 sacks, PM Modi

200 kg of chits was seized during the class 12 exam in a centre in Gujarat. Officials discovered micro-sized photocopies of answers. Reportedly, the chits had to be packed in 20 sacks.

గుజరాత్ మోడల్: పరీక్ష కేంద్రం నుంచి 200 కిలోల చీట్టీలు..

Posted: 05/24/2018 04:27 PM IST
Gujarat model 200 kg of chits seized in class 12 exam centre

రెండున్నరేళ్ల క్రితం బిహార్ లోని ఓ పరీక్షా కేంద్రంలో అక్కడి విద్యార్థులు పరీక్షల నేపథ్యంలో మాస్ కాపీయింగ్ కు పాల్పడితే బీజేపి రాష్ట్ర నేతలు అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశానికి గుజరాత్ మోడల్ అంటూ చూపించి అధికారంలోకి వచ్చిన ప్రధాని తన సొంత రాష్ట్రంలో పరీక్షల సందర్భంగా జరుగుతున్న వైనాన్ని మాత్రం చూడలేకపోతున్నారా.? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అంతేనా లేక ఇది కూడా దేశానికి గుజరాత్ మోడలేనా అన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఓ పరీక్షా కేంద్రంలో జరిగిన మోసాన్ని కిలోలతో సహా బయటపెట్టారు అక్కడి అధికారులు. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతులు కాలకైనా ఆకులు పట్టుకున్నారన్నవారు కూడా లేకపోలేరు. కేవలం ఒక్క పరీక్షలో ఓ ఎగ్జామ్ సెంటర్ నుంచి  200 కిలోల చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా వంథాలీలో ఇటీవల జరిగిన 12వ తరగతి సైన్స్ పరీక్ష‌ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చీటీల్లో కనిపించీ కనిపించనంత చిన్న అక్షరాలతో సమాధానాలు ఉన్నాయి.

వీటిని తరలించేందుకు బోర్డు అధికారులు 20 గోనెసంచులు వాడాల్సివచ్చింది. గుజారాత్ బోర్డు ఎగ్జామినేషన్ కమిటీ విచారణ సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన సిబ్బందితో పాటు, ఎగ్జామ్ కోఆర్డినేటర్ కు సైతం సమన్లు జారీచేయాలని నిర్ణయించారు. డీఈవో బీఎస్ కెల్లా మాట్లాడుతూ... ‘‘స్వామి నారాయణ్ గురుకుల్ పరీక్షా కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ మాకు సమాచారం వచ్చింది. మార్చి 14న మేము పరీక్షా కేంద్రానికి వెళ్లే సరికి టెన్త్ పరీక్ష జరుగుతోంది.

చిన్న చిన్న కాగితాలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. అవన్నీ ఇంతకు ముందే విద్యార్దులు వదిలిపెట్టిన కాపీల తాలూకు చిట్టీలే..’’ అని వెల్లడించారు. దీంతో 12వ తరగతి విద్యార్ధులందర్నీ తమ వద్ద ఉన్న చిట్టీలన్నీ వెనక్కి ఇచ్చేయాలని హెచ్చరించామన్నారు. దాదాపు మూడుసార్లు హెచ్చరించిన తర్వాత అందరూ తమ చీటీలను ఇచ్చేశారనీ.. తనిఖీలు చేసిన తర్వాత ఇంకో 15 మంది చీటీలను ఇవ్వకుండా దొరికి పోయారని కెల్లా పేర్కొన్నారు.. దీంతో ఆ 15 మందితో పాటు కేసు నమోదైన కోఆర్డినేటర్లు, సూపర్‌వైజర్లకు సమన్లు జారీ చేయనున్నట్టు బోర్డు వైస్ చైర్మన్ ఎన్సీ షా పేర్కొన్నారు. విద్యార్ధులు ఇచ్చినవిగానీ, అధికారులు స్వాధీనం చేసుకున్నవిగానీ మొత్తం 200 కిలోల చిట్టీలు అయ్యాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mass Copying  gujarat model  ahmedabad  class 12 exam  board exams  200 kilo chits  20 sacks  PM Modi  

Other Articles