Anam Viveka passes away సింహపురి సీనియర్ రాజకీయ నేత అనం వివేక ఇకలేరు

Senior tdp leader anam vivekananda reddy passes away

Anam Vivekananda Reddy,TDP ,KIMS hospital,passes away,anam vivekananda reddy passes away,anam vivekananda reddy death,anam vivekananda reddy dead,anam vivekananda reddy died,anam viveka no more, andhra pradesh, politics

Nellore strongman and former MLA Anam Vivekananda Reddy, who was undergoing treatment at a private hospital in Hyderabad, passed away on Wednesday morning. He was 67.

సింహపురి సీనియర్ రాజకీయ నేత ఆనం వివేక ఇకలేరు

Posted: 04/25/2018 10:16 AM IST
Senior tdp leader anam vivekananda reddy passes away

సీనియర్ రాజకీయ నేత, రాష్ట్ర రాజకీయాలపై తనకంటూ ఓ ముద్రవేసుకున్న రాజకీయ నేత, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి (67) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆనం వివేకానంద రెడ్డి ఉపిరితిత్తులు వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంల కుటుంబసభ్యులు ఆయనను కొన్ని రోజుల కిందట కిమ్స్ అసుపత్రిలో చేర్చించారు. అయితే ఆయన కిమ్స్ లో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు చెప్పారు. ఇక నిన్నటి నుంచి ఆయన శరీరం వైద్యచికిత్సలకు కూడా ప్రతిస్పందించడం లేదని వైద్యులు తెలిపారు. కొన్నివారాల చికిత్స తరువాత కూడా ఆయన కోలుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన కుటుంభసభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతగా సింహపురిలో ముద్రవేసుకున్న ఆయన.. గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anam Vivekananda Reddy  TDP  KIMS hospital  passes away  andhra pradesh  politics  

Other Articles