7 yr old trecks mount killimanjaro to meet pawan kalyan పవన్ కల్యాణ్ కోసం ఏఢేళ్ల బాలుడి సాహసం

7 yr old trecks mount killimanjaro to meet pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan Political Yatra, pawan kalyan meet, Samanyu Pothuraju, Mount Kilimanjaro, Africa, Hyderabad boy, mountaineering

Meet Samanyu Pothuraju, who along with his coach along with his coach, unfurled the Tricolour at a height of 5,895 m above the sea level on April 2 to meet actor turned politician Jana Sena chief pawan kalyan.

ITEMVIDEOS: పవన్ కల్యాణ్ ను చూడాలని ఏఢేళ్ల బాలుడి ఏం చేశాసాడంటే..

Posted: 04/16/2018 06:21 PM IST
7 yr old trecks mount killimanjaro to meet pawan kalyan

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆ బాలుడికి ఎంతో అభిమానం. తన అభిమాన హీరోను చూడాలన్నది తన బలమైన కోరిక. ఈ కోరికను నెరవేర్చాలని తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు ఓ కండీషన్ పెట్టారు. అంతే వారి కండీషన్ కు అంగీకరించిన బాలుడు.. ఆఫ్రికా దేశంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించాడు. ఏకంగా పదిహేడు వేల అడుగుల ఎత్తు (5,895 మీ)... అత్యల్ప ఉష్ణోగ్రతలు... బలమైన గాలులు... వీస్తున్నా లెక్క చేయక.. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టుండే ఈ పర్వత శిఖరాన్ని చూస్తూ అసలే మాత్రం భయం అన్నది లేకుండా కిలిమంజారో పర్వతశ్రేణిలోని అత్యంత ఎత్తైన ప్రాంతమైన ‘‘ఉహ్రూ’’ శిఖరాన్ని అధిరోహించాడు.
 
ఆ బాలుడే సమన్యు పోతురాజు(7). హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు.. తన కోచ్ తో కలిసి సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి.. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రికార్డ్ ను నెలకొల్పాడు. ఈ ఒక్క పర్వతమే కాదు.. మే నెలాఖరులోగా మొత్తం 10 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు పోతురాజు. ఓవైపు భారీ వర్షం.. మరోవైపు రాళ్లతో నిండిఉన్న రోడ్డు.. చాలా భయమేసింది. కాళ్లకు గాయలయ్యాయి. తీవ్రమైన నొప్పులతో ముందుకు కదలలేని స్థితి. అయినా కొంత సేపు విశ్రాంతి తీసుకుని ముందుకు కదిలామని చెప్పాడు పోతురాజు.

అయితే పర్వతం ఎక్కాలన్న కోరిక ఎందుకు కలిగింది అంటే.. తనకు పవర్ స్టార్ పవన్ కల్యాన్ అంటే ఇష్టమని, అతడ్ని కలిపించాలని మా పేరెంట్స్ ను అడిగాను. అయితే ఏదైనా ఘనత సాధించి ప్రపంచ రికార్డు సాధిస్తే.. అప్పుడు పవన్ కల్యాన్ ను కలిపిస్తానని మా అమ్మ ప్రామిస్ చేసిందని.. దీంతో తనకు మంచు అంటే ఇష్టం కాబట్టి.. మంచు పర్వతాలను అధిరోహించేందుకు పూనుకున్నానని చెప్పాడు. ఈ పర్వతంతో పాటుగా వచ్చే నెలాఖరులో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పాలని ఉందని పోతురాజు చెప్పాడు. పర్వాతారోహణ చేయడం ఎంతో సంతోషంగా వుందని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Samanyu Pothuraju  Mount Kilimanjaro  Africa  mountaineering  Hyderabad  

Other Articles