AP needs bulldozers to dig corruption ఆంధ్రలో అవినీతిని తొవ్వేందుకు బుల్డోజర్: బీజేపి నేత

Somu veeraju fires on tdp says ap needs bulldozers to dig corruption

somu veeraju, corruption, special status, chandrababu, BJP, TDP, Andhra pradesh special status, ruling party, TDP, chandrababu, state bifurcation bill promises, YS jagan, Pawan Kalyan, JanaSena, andhra pradesh, politics

After TDP and BJP cut off their friendship due to special status issue, BJP Leader Somu Veeraju fires on Andhra pradesh ruling party says, AP needs bulldozers to dig corruption instead of Jemmy.

ఆంధ్రలో అవినీతిని తొవ్వేందుకు బుల్డోజర్: బీజేపి నేత

Posted: 03/24/2018 11:37 AM IST
Somu veeraju fires on tdp says ap needs bulldozers to dig corruption

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందని బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అరోపించారు. ప్రతి కార్యక్రమంలో అవినీతి పరాకాష్టకు చేరిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ క్రమంలో ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని, బుల్డోజర్ కావాలని వ్యంగవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతికి ‘పట్టిసీమ’ పరాకాష్ట అని, రూ.1120 కోట్లతో ‘పట్టిసీమ’ మొదలైందని, ఇప్పుడు రూ.1667 కోట్లకు వెళ్లిందని అన్నారు.

పట్టిసీమలో ఏర్పాటు చేసిన మోటార్లు 30 అని చెప్పారని, కేవలం 24 మోటార్లు మాత్రమే పెట్టారని, పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉందని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ కు 20 అవార్డులు వచ్చాయన్న మాటే కానీ, ఆయన సంబంధిత శాఖలో అవినీతే రాజ్యమేలుతుందని ఎద్దేవా చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రతకు రూ.40 లక్షలు కేటాయించడం అవసరమా అని ప్రశ్నించిన ఆయన, ఉపాధి హామీ, సర్వశిక్ష అభియాన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో స్వచ్ఛా భారత్ కార్యక్రమంలో భాగంగా టాయ్ లెట్లు కట్టే సోమ్మను కూడా పాలకులు నొక్కేశారని అది వేల కోట్ల రూపాయలని ఆయన అరోపించారు. అంతేకాదు ఆయన టీడీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని అభివర్ణించిన ఆయన అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లిన పార్టీ టీడీపీయేనని ఆరోపించారు. ఏపీలో పరిపాలన గాడి తప్పుతోందని, ఎమ్మెల్యేలను అదుపు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

* ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయా.? లేదా..?
* చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారా లేదా..?
* పట్టిసీమ ఎత్తిపోతలలో ఉన్న మెకానిజం ఏంటి? స్పిల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు ఎందుకు.?
* మట్టి తీయడానికే రూ.67 కోట్లు ఖర్చాయ్యిందా..?
* ప్రధాన కాలువలో కలపడానికి పంపు సెట్లకు రూ.817 వెచ్చించారా.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somu veeraju  corruption  special status  chandrababu  BJP  TDP  andhra pradesh  politics  

Other Articles