Narayana Murthy doesn't understand demonetisation logic ‘‘నోట్ల రద్దు వెనుక లాజిక్ అర్థమే కాలేదు’’

Could not understand logic behind demonetisation narayana murthy

Economy of India, India, Infosys, Kannada people, Narayana Murthy, Narendra Modi, Murthy, IT Services & Consulting - NEC, Presidency University, Narendra Modi government, infosys co-founder, higher currency note, RS 2000 note, demonetisation, Remonitesation

Infosys co-founder Narayana Murthy said he could not understand the logic behind the Modi government's note ban move, particularly when it remonetised the monetary system with same or even higher denomination currency notes.

నోట్ల రద్దు వెనుక లాజిక్ అర్థేమే కాలేదు: నారాయణమూర్తి

Posted: 03/22/2018 11:21 AM IST
Could not understand logic behind demonetisation narayana murthy

2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంలో అంతర్యమేమిటో ఇప్పటికీ తనకు అర్థమే కాలేదని, అసలు దాని వెనకనున్న లాజిక్ ఏంటో కూడా తెలియలేదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించిన ఆయన తాను ఆర్థికశాస్త్ర నిపుణుడిని కాదని అంటూనే దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ తనకు అర్థంకావడం లేదని అన్నారు.

అవినీతి, అక్రమాలకు పెద్ద నోట్లు పునాది వేస్తున్నాయన్న కేంద్రం వివరణ సమంజసంగానే వున్నా.. రమారమి మళ్లీ అదే నోటును లేక అంతకన్నా పెద్ద నోటును చెలామణిలోకి తీసుకురావడంలో వున్నఅంతర్యమేమిటన్నది తనకు అర్థంకాని విషయమన్నారు. అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని పట్టణ మేధావులు వ్యతిరేకించగా, గ్రామీణ భారతీయులు మాత్రం స్వాగతించారని ఆయన చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయంపై నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరని ఆయన అన్నారు.

దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ పోవడానికి కారణం స్వల్పశ్రేణి తయారీ రంగంపై దృష్టి సారించకపోవడమేనని ఆయన అన్నారు. 1950 నుంచి చైనా, జపాన్ లు ఈ రంగంపై దృష్టి సారించగా, మనం మాత్రం దానిని పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో స్కూల్ కి వెళ్తున్న చిన్నారుల్లో 75 శాతం మంది 8వ తరగతిలో చేరకముందే బడి డ్రాపవుట్లుగా మారుతున్నారనిన అయన అవేదన వ్యక్తం చేశారు. అయితే వీరికి వున్న విద్యార్హతల నేపథ్యంలో ఉపాధి లభించే అవకాశాలు తక్కువన్నారు.

కాగా ఇలాంటి వారి సమస్యను స్వల్పశ్రేణి తయారీ రంగం తీర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిరుద్యోగులకు 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఉపాధి కల్పించాలని, అలా జరగాలంటే స్వల్పశ్రేణి తయారీరంగంపై ఇప్పటికైనా దృష్టిసారించాలని ఆయన సూచించారు. దురదృష్టవశాత్తు భారత్‌ లో స్వల్ప శ్రేణి తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మనదేశ ఆర్థికవేత్తలు దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles