All Eyes on Kamal Haasan Big Announcement Today | కమల్ పార్టీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి.. తెలంగాణ సీఎంతోసహా అందరికీ ఆహ్వానం

Kamal party launch details

Kamal Haasan, Political Party Launch, Madurai, Tamil Nadu Politics, Kamal Party Announcement, Kamal New Party Launch

Kamal Haasan Big Political Party Launch In Madurai. Kamal Haasan visited former president APJ Abdul Kalam's home in Rameswaram today. The 63-year-old is later scheduled to address public meetings in Ramanathapuram, Manamadurai and Paramakudi, his home town, before launching his new political party by flying its flag in Madurai.

కమల్ పార్టీ ప్రకటనకు ఊహించని స్పందన

Posted: 02/21/2018 10:48 AM IST
Kamal party launch details

తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ తన రాజకీయ ప్రస్థానంతో హాట్ టాపిక్ గా మారారు. నేటి సాయంత్రం మధురైలోని బహిరంగ సభలో ఆయన పార్టీ ప్రకటన, జెండాను ప్రదర్శించనునన్న విషయం తెలిసిందే. ఈ ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి ఆయన తొలి అడుగు వేశారు. కలామ్ కు నివాళులు అర్పించిన ఆయన, రామేశ్వరం, పరమకొడి, మధురై ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

సాయంత్రం ఆరు గంటలకు చివరిగా బహిరంగ సభలో తన పార్టీ పేరు, జెండా తదితర వివరాలను కమల్ స్వయంగా వెల్లడించనున్నారు.ఇప్పటికే కమల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ కలసి చర్చించిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కమల్ సమావేశాలు నిర్వహించడాన్ని పరిశీలిస్తుంటే, ఆయన కేంద్రంలోని అధికార కూటమికి సాధ్యమైనంత దూరంగానే ఉంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హాజరయ్యే వారి వివరాలు...

నేడు కమల్ మధురైలో నిర్వహించే సభకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం గమనార్హం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీశ్ కుమార్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కే చంద్రశేఖర్ రావులను కూడా కమల్ ఆహ్వానించారని తెలుస్తుండగా, వారు పాల్గొంటారా? లేదా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సభను కవర్ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ, కోల్ కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వార్తాసంస్థల ప్రతినిధులు ఇప్పటికే మధురై చేరుకున్నారని తెలుస్తోంది.

మదురైలోని 'ఓక్స్' గ్రౌండ్ వేదికగా ఈ బహిరంగ సభ జరుగనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు మదురైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన తేని, విరుద్ నగర్, రామనాథపురం, శివగంగై, దిండిగల్, పుదుకొట్టాయ్, తిరుచిరాపల్లి, కరూర్, తిరువూర్, తంజావూరు, నాగపట్టణం తిరునల్వేలి ప్రాంతాల్లోని అభిమాన సంఘాల నేతలు నడుంబిగించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రులు మధ్యాహ్నానికి మదురై చేరుకుంటారని కమల్ హాసన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలతో పాటు.. ఎండీఎంకే, డీఎండీకే వంటి చిన్నా చితకా పార్టీలు ఉండగా,విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న కమల్ రాజకీయ ప్రస్థానం హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Political Party  Launch  

Other Articles