Trujet to start Kadapa-Vijayawada flight from Mar 1 రాష్ట్ర ప్రజలకు రాంచరణ్ ట్రూజెట్ బంఫర్ ఆఫర్

Trujet to start kadapa vijayawada flight from mar 1

Ram Charan, Regional Connectivity Scheme, RCS, UDAN, Ude Desh ka Aam Nagarik, Trujet, kadapa, Vijayawada, New Service, Nanded, Cuddapah, Mysore, Vidyanagar, airlines, Turbo Megha Airways

Trujet, Hyderabad-based Turbo Megha Airways is all set to connect Cuddapah to Vijayawada from March 1, the only airlines connecting Cuddapah through the "Regional Connectivity Scheme" (RCS) of UDAN (Ude Desh ka Aam Nagarik).

రాష్ట్ర ప్రజలకు రాంచరణ్ ట్రూజెట్ బంఫర్ ఆఫర్

Posted: 02/08/2018 12:36 PM IST
Trujet to start kadapa vijayawada flight from mar 1

టాలీవుడ్ హీరో, మోగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ గత కొంతకాలం కింద పౌర విమానయాన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు చెందిన టర్బో మెఘా ఎయిర్ వేస్ సంస్థ ట్రూ జెట్ విమానా కొత్త సర్వీసును ప్రారంభించనుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ పలు విమాన సర్వీసులను ప్రారంభించి ట్రూజెట్.. మార్చి 1 నుంచి నవ్యాంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాన్ని.. రాజధాని అమరావతితో కలిపే కొత్త సర్వీసును ప్రారంభించనుంది.

అయితే ఏముందబ్బా విషయం అంటారా..? ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాంచరణ్ ట్రూజెట్ బంఫర్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ సర్వీసులను ప్రారంభించనున్న తరుణంలో విమానయానం చేయాలని అసక్తి చూపేవారి కోసం అత్యంత చౌకధరకు విమాన టిక్కెట్ ను కూడా అందిస్తుంది. ప్రారంభ ఆఫర్ గా రూ. 798కే విమాన ప్రయాణం చేయవచ్చని తెలిపింది.

ప్రతి రోజూ ఉదయం 8.05 గంటలకు విజయవాడలో బయలుదేరే విమానం కడపకు 9.10కి చేరుతుందని, తిరిగి 9.40కి కడప నుంచి టేకాఫ్ అయి, విజయవాడకు 10.45కు వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. తాము ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడుపుతున్నామని గుర్తు చేసిన సంస్థ, ఇప్పుడు విజయవాడకూ ప్రారంభించామని పేర్కొంది.

ఉడా దేశ్ కే అమ్ నాగరిక్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రీజనల్ కనెక్టివిటీ స్కీం కింది చిన్న పట్టణాలకు కూడా విమానయానాన్ని దగ్గర చేయాలన్న తాము ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నామని టర్బో మెఘా ఎయిర్ లైన్స్ తెలిపింది. దీంతో ఇక విజయవాడ నుంచి కడపకు నేరుగా విమానాలను నడనున్నామని చెప్పింది. ఇప్పటికే నాందేడ్, కడప, మైసూర్, విద్యానగర్, చెన్నైలకు విమానసర్వీసులను అందిస్తున్నామని కూడా ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Regional Connectivity Scheme  RCS  UDAN  Ude Desh ka Aam Nagarik  Trujet  kadapa  Vijayawada  

Other Articles