Remove High Court Judge, CJI To President ఆ జస్టిస్ ను డిస్మిస్ చేయండి

Remove high court judge for misconduct chief justice writes to president

President, CJI, chief justice of India, Ram Nath Kovind, dipak mishra, Allahabad High Court, three-judge panel, Justice SN Shukla, medical admissions scam, retired judge IM Qudussi, voting in parliament

A judge of the Allahabad High Court, indicted by a committee of judges for misconduct in the medical admissions scam, should be removed, says Chief Justice of India Dipak Misra

ఆ జస్టిస్ ను డిస్మిస్ చేయండి: ప్రెసిడెంట్ కు సీజే లేఖ

Posted: 01/31/2018 11:32 AM IST
Remove high court judge for misconduct chief justice writes to president

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరు.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని అత్యున్నత న్యాయస్థానికి చెందిన సీనియర్ న్యాయమూర్తులు తొలిసారిగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఘటనను మర్చిపోకముందే.. అదే తరహాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఓ న్యాయమూర్తిపై వేటు వేయాలని కొరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిస్తూ లేఖ రాయడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది.

దేశ ప్రధాన న్యాయమూర్తి ఓ జస్టిస్ విషయంలో ఇలా వ్యవహరించడం కూడా అత్యంత అరుదు. కానీ గౌరవమైన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతూ అక్రమాలకు పాల్పడిన జస్టిస్ లపై ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పుమాత్రం లేదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. మెడికల్ అడ్మిషన్ల స్కాంకు తెరతీసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్ఎన్ శుక్లాపై వేటు వేయాలని సీజేఐ.. రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాశారు.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి భారీ స్కాం చోటు చేసుకుంది. కొన్ని మెడికల్ కాలేజీలపై బ్యాన్ ఉన్న సమయంలో కూడా విద్యార్థులను చేర్చుకోవడానికి శుక్లా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఎస్ఎన్ శుక్లా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.

దీంతో, ముగ్గురు జడ్జిలతో కూడా ఓ కమిటీ శుక్లాపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా శుక్లా ముడుపులు తీసుకున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో, శుక్లాను తొలగించాలంటూ జడ్జిల ప్యానెల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రెకమెండ్ చేసింది. దీంతో, శుక్లాపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సీజేఐ లేఖ రాశారు. హైకోర్టు జడ్జిలను తొలగించాలంటే పార్లమెంటులో ఓటింగ్ జరగాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President  CJI  Ram Nath Kovind  dipak mishra  Allahabad High Court  SN Shukla  

Other Articles