Two held for filming couples intimacy scene భార్యభర్తల సన్నిహిత వీడియో చిత్రీకరణ..

Two held for filming couples intimacy scene

aganampudi toll gate. lakshmi ganapathinagar, wife and husband, filiming video, intimacy video, differences, chinna, chinna vasu, uma maheshwar rai, car driver, vishakapatnam, andhra pradesh, crime

vishaka police arrested two miscreants for filming couples intimacy scene in vishakapatnam near aganampudi toll gate.

భార్యభర్తల సన్నిహిత వీడియో చిత్రీకరణ.. ఇద్దరు అరెస్టు

Posted: 01/31/2018 09:36 AM IST
Two held for filming couples intimacy scene

భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్నా సమయంలో దొంగచాటుగా వారి వీడియో చిత్రీకరించిన ఇద్దరు యువకులకు పోలీసులు అరదండాలు వేసి కటకటాల వెనక్కి పంపారు. అలికిడి కారణంగా వారిని గుర్తించిన భర్త.. అరుస్తూ వారిని గుర్తించాడు. దీంతో వారిపై పోలీసులకు పిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం ఆగనంపూడి టోల్ గేట్ సమీపంలో లక్ష్మీగణపతినగర్ కు చెందిన ఓ స్థానిక వ్యాపారవేత్త వద్ద చిన్నా అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చిన్నాకు ఆయన భార్యకు మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో, వీరిద్దరూ కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన యజమాని వారిద్దరినీ తన ఇంటికి పిలిచి పెద్దమనిషి తరహాలో ఇద్దరి రాజీపడాలని అదే జీవితమని సర్థిచెప్పి.. చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దని సూచించారు.

ఈ నేపథ్యంలో వారిద్దరినీ కొద్దిసేపు అక్కడి ఓ గదిలోకి పంపించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోవాల్సిందిగా చెప్పాడు. ఇక వారికి అక్కడే వుండేందుకు కూడా ఓ గదిని ఇచ్చాడు. దీంతో వారు ఆ గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో కూర్మన్నపాలేనికి చెందిన చినవాసు, ఉమామహేశ్వరరావు అనే యువకులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దీన్ని గమనించిన చిన్నా కేకలు వేయడంతో ఇద్దరూ పారిపోయారు. దీంతో, ఆయన దువ్వాడ పోలీసులకు జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles