Amala Paul gets anticipatory bail అమలాపాల్ కు ఊరట.. బెయిల్ మంజూరు..

Amala paul gets big relief in kerala high court in tax evasion case

Tax evasion case, Amala Paul, Actress, anticipatory bail, kerala High Court, puducherry, kerala

Kerala high court has granted anticipatory bail to actress Amala Paul in the tax evasion case, wherein she allegedly tried to evade payment of Kerala road tax by registering her posh car in Puducherry.

అమలాపాల్ కు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు..

Posted: 01/17/2018 07:33 PM IST
Amala paul gets big relief in kerala high court in tax evasion case

ప్రముఖ సినీ నటి అమలాపాల్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. అమెకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించింది. పన్ను ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెపై పోలీసులు కేసు నమోదు చేయడం.. కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని అదేశాలు ఇవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అమలాపాల్ కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కు న్యాయస్థానం మంజూరు చేసింది.

అయితే అంతకుముందు అమల పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం పోలీసులకు లొంగిపోవాలని అమెను అదేశించింది. దీంతో క్రితం రోజున తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అమల లొంగిపోగా.. ఇవాళ అమె దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం పలు షరుతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2017లో అమలాపాల్‌ రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా రూ. 20 లక్షల పన్నును అమలా ఎగవేశారని పోలీసుల అభియోగాలను మోపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tax evasion case  Amala Paul  Actress  anticipatory bail  kerala High Court  puducherry  kerala  

Other Articles

Today on Telugu Wishesh