Hero Nitin Cleared From 'Akhil' Court Case హీరో నితిన్ కు భారీ ఊరట

Big relief to nitin and nikitha high court stucks criminal case

hero nitin, akhil, g. satyanarayana, nikita reddy, sudhakar reddy, sresht movies, high court, malkajgiri court, court notices, warrants

Going through the case, a criminal court magistrate felt that both Nitin and Nikita have nothing to do with the issue as they are not even partners of Sresht Movies and struck the case against them.

హిరో నితిన్ పై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేత

Posted: 01/09/2018 12:51 PM IST
Big relief to nitin and nikitha high court stucks criminal case

అక్కినేని వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయైన అఖిల్ ను.. ‘అఖిల్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన అతని మిత్రుడు నితిన్ కు భారీ ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన అంశంలో ప్రముఖ హీరో నితిన్ సహ అతని సోదరి నిఖితా రెడ్డిలపై దాఖలైన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే.. 'అఖిల్' చిత్రం హక్కులను ఇస్తామంటూ, రూ. 50 లక్షలు టాలీవుడ్ హీరో నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డిలు మోసం చేశారని జి సత్యనారాయణ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని అశ్రయించాడు.

నితిన్, నిఖిత, వారి తండ్రి సుధాకర్ రెడ్డి, శ్రేష్ఠ్ మూవీస్ లను నిందితులుగా పేర్కొని వారు తనను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. దీంతో సత్యనారాయణ దాఖలు చేసిన క్రిమినల్ కేసును విచారణకు స్వీకరించిన మల్కాజిగిరి కోర్టులో ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ వారికి నోటీసులు కూడా జారీ చేసింది.

ఇక ఈ కేసును కొట్టివేయాలని వేర్వేరుగా నితిన్, నిఖితలు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తూ, ఇది చెక్కులకు సంబంధించిన వివాదమని, సివిల్ కేసును క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. దీంతో సత్యనారాయణ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి తన తీర్పును వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero nitin  akhil  g. satyanarayana  nikita reddy  sudhakar reddy  sresht movies  high court  

Other Articles