anandalahari social boycotts ghazal srinivas గజల్ శ్రీనివాస్ పై అనందలహరి జీవితకాల నిషేధం

Anandalahari social boycotts ghazal srinivas

ghazal srinivas, anadalahari, molesting charges, chanchalguda jail, singer, aalayavani, web radio, crime

Guinness World Record Awardee Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas was socially boycotted by anandalahri for life time on molestation charges.

‘గజల్’పై కళాసంఘాలు గరం.. గరం..

Posted: 01/06/2018 12:22 PM IST
Anandalahari social boycotts ghazal srinivas

పేరు ప్రఖ్యాతులు రావడానికి కష్టపడినంతగా వాటిని నిలుపుకునేందుకు కూడా కష్టపడాల్సి వుంటుందన్నది పెద్దల మాట. సంఘంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వాళ్లు కూడా చేయకూడని పాడు పనులు చేసి.. అడ్డంగా దొరికిపోతే.. వారిపై వచ్చే అరోపణలకు అడ్డూ అదుపూ వుండదు. గతాల నుంచి అన్ని తొవ్వకుంటూ వారి జీవితంలోని అన్ని విషయాలను పబ్లిక్ చేసేస్తారు. అయితే గజల్ శ్రీనివాస్ విషయంలో అలా జరగలేదు కానీ.. విమర్శించని వారంటూ ఎవరూ లేరు.

తొలిసారిగా లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొన్న తరువాత ఇది అతని చుట్టూ పడరాని వారు వేసిన ఉచ్చని భావించినా.. అతని వీడియోలు, ఫోటోలు బహిర్గతం కావడంలో.. ఒకటి తరువాత ఒకటి ఆయనకు షాకులు తగులుతూనే వున్నాయి. లైంగిక అరోపణలపై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ లో వున్న గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై తాజాగా సాంస్కృతిక సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మహిళలను తోబుట్టువుల్లాగా పరిగణించి.. అడపడచులుగా చూడాల్సిన ప్రముఖుడే.. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట వద్దని, కఠినంగా శిక్షించాలని ‘ఆనందలహరి’ సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. కళను అడ్డుపెట్టుకుని ఇటువంటి నీచ  కార్యక్రమాలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మిగతా సాంస్కృతిక, కళా సంఘాలు కూడా తమ బాటనే అనుసరించాలని సూచించింది.

గజల్ శ్రీనివాస్‌పై నమోదైన కేసును నీరుగార్చేందుకు కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. కేసును సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికి తీయాలని పోలీసులను కోరింది. కళను ఇటువంటి దుర్మార్గపు, నీచ కార్యక్రమాలకు వాడుకోవడం హేయమని ధ్వజమెత్తింది. ఒత్తిళ్లకు లొంగకుండా కేసు దర్యాప్తు చేసి శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని ‘ఆనందలహరి’ డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghazal srinivas  anadalahari  molesting charges  chanchalguda jail  singer  aalayavani  web radio  crime  

Other Articles