Ghazal Srinivas Bail Plea Rejected | గజల్ కు నాంపల్లి కోర్టు షాక్.. పోలీసులపై బెంచ్ ఫైర్

Ghazal srinivas bail rejected

Ghazal Srinivas, Nampally Court, Bail Reject, Ghazal Srinivas Allegations, Ghazal Srinivas PA Parvathy

Ghazal Srinivas Bail Plea Rejected by Nampally Court. Singer Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas, was arrested on Tuesday on a charge of sexual harassment levelled against him by a woman radio jockey. The woman approached the cops with video evidence, the police said.

గజల్ శ్రీనివాస్ బెయిల్ తిరస్కరణ

Posted: 01/05/2018 05:50 PM IST
Ghazal srinivas bail rejected

యువతిని లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కళాకారుడు గజల్ శ్రీనివాస్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

మరోవైపు పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో సీడీలను తమకు సమర్పించకపోవటంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీడీలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని నిలదీశారు. ఇక కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉందని ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మీడియాకు పార్వతి ఇంటర్వ్యూలు ఇస్తుంటే... ఆమె పరారీలో ఉంది అని చెబుతారా అంటూ నిలదీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles