ys jagan promises to school joining kids అదిరిన హామీ.. బడికి పంపితే.. పిల్లలకు రూ.15 వేలు..

Ys jagan promises rs 15000 to school joining kids

jagan promise to school going kids, jagan election promise, jagan fees reimbursement, jagan pension promise, Praja Sankalpa Yatra, YS Jagan Mohan Reddy, PrajaSankalpaYatra, ys jagan padayatra, YSRCP

YSRCP president Jagan mohan reddy promises are very attractful, his new promise wins the hearts of school aspiring kids.

అదిరిన హామీ.. బడికి పంపితే.. పిల్లలకు రూ.15 వేలు..

Posted: 01/05/2018 03:50 PM IST
Ys jagan promises rs 15000 to school joining kids

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోకుండా తమ గుండెల్లో అట్టిపెట్టుకున్నారంటే.. అయన చేసిన ప్రజాహిత కార్యక్రమాలే అందుకు కారణం. పావలా వడ్డీ రుణాల, పింఛన్ల పెంపు ఓ వైపు అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు చేస్తున్నా.. వాటన్నికంటే మించి.. 108, ఫీజు రియంబర్స్ మెంట్, అరోగ్య శ్రీ వంటి పథకాలు వైఎస్ ను ఎన్నో కుటుంబాలలో దేవుఢ్ని చేసింది. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసారన్న వార్తను కూడా జీర్ణించుకోకుండా ఆయన కోసం గుండెలు అలమటించేలా చేసింది.

అయితే సమైక్య రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరుణంలో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిని, అధికార పార్టీని ఎన్నుకునే క్రమంలో అనేక రాజకీయ మార్పులు జరిగినా.. గెలుపు ముంటకు వచ్చిన జగన్ పార్టీ బోల్తాపడింది. కేవలం ఐదు లక్షల ఓట్లతో అధికారానికి దూరమైంది. అయితే ఇందకు జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రచారం కూడా మేలు చేసింది. అంతేకాకుండా హైదరాబాద్ మహానగరాన్ని తానే అభివృద్ది బాటలోకి తీసుకువచ్చానని చంద్రబాు ఊరూవాడ ప్రచారం కూడా కొంత అయనకు దోహదం చేసింది.

అయితే మరో ఏడాది కాలంలో రానున్న ఎన్నికల దరిమిలా అధికార పార్టీ జన్మభూమి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుండగా, ఇటు విపక్ష నేత కూడా ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల చెంతకు పాదయాత్రగా వెళ్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. యాభై రోజులుగా చేస్తున్న యాత్రలో భాగంగా ఇన్నాళ్లు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్ముతారో లేదోకానీ.. ఇవాళ వైసీపీ అధినేత జగన్ చేసిన తాజా హామీ మాత్రం.. ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలకు గుర్తుచేసేలా వుంది. ఇంతకీ అది ఏ హామీ అంటారా..?

బడికి దూరంగా వున్న పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ అటు వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్ మెంటు హామీ కన్న బ్రహ్మండంగా వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలని కోరిక, తపన వున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ వర్తిస్తుంది కానీ.. పాఠశాలలకు దూరంగా విద్యార్థులను ఎలా రప్పించాలన్న కోణంలో అలోచించిన జగన్.. ఈ మేరకు సముచిత నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తండ్రిని మించిన తనయుడిగా జగన్ అప్పుడే కోందరు రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తండ్రిలా పేద ప్రజల పక్షాన అలోచించి జగన్ ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకువచ్చారని కొనియాడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 53వ రోజైన ఇవాళ ఆయన పుంగనూరు నియోజకవర్గం కురవల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బడికి దూరమైన పిల్లలను పాఠశాలకు పంపితే 15 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించారు.

బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన వారే అధికంగా పాఠశాల విద్యకు దూరమవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడి ఇంటి నుంచి డాక్టర్‌, ఇంజనీర్లు వుండాలన్న తన తండ్రి ఆశయం సిద్దంచడానికే తాను ఈ పథకాన్ని ప్రవేశపెడతానని పిలుపునిచ్చారు. ఇక దీంతో పాటు ప్రస్తుత ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్ ను రెండువేలకు పెంచుతామని హామి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పింఛన్‌ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామని వైఎస్ జగన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles