Central cancels Akkineni Foundation’s recognition | నాగ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి బిగ్ షాక్

Big shock to akkineni family

Akkineni International Foundation, Nagaruja Akkineni, Akkineni International Award, NGOs Reorganizations, Akkineni International Award

Central government cancelled recognition of ‘Akkineni International Foundation’ along with few other NGOs due to non-submission of Income Tax returns.

అక్కినేని కుటుంబానికి షాక్!

Posted: 01/04/2018 03:51 PM IST
Big shock to akkineni family

తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎన్జీవోల లైసెన్స్ లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అందులో హీరో నాగార్జునకు చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా ఉందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు రాజ్యసభలో ఈ మేరకు విషయాన్ని తెలిపారు. తెలంగాణలో 190.. ఆంధ్రాలో 450 సంస్థల లైసెన్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. వీరంతా విదేశాల నుంచి ఫండ్లు స్వీకరిస్తూ.. వార్షిక ఆదాయంలో ఆ వివరాలను పొందుపరచలేదని ఆయన వెల్లడించారు.

కాగా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటంలో విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అక్కినేని నేషనల్ అవార్డులను ప్రధానం చేయటంతోపాటు, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరపున గ్రామీణ ప్రాంతాల్లో పలు సహయక చర్యలు అక్కినేని కుటుంబం చేపడుతూ వస్తోంది. అయితే దీనిపై అధికారికంగా అక్కినేని కుటుంబం మాత్రం స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles