Few More Proofs for Ghazal Srinivas Allegations | పాడు గజాలా.. మరిన్ని వీడియోలు చిక్కాయి...

Gajal srinivas few more videos

Ghazal Srinivas, Sexual Allegations, Panjagutta Police, Chanchalguda Jail, PA Parvathy, Ghazal Srinivas Bail, Ghazal Srinivas Case, Sexual Allegations Ghazal Srinivas

Ghazal Srinivas Booked Red Handed with Video Proofs. Later Victim Submit few more videos about his harassment.

గజల్ శ్రీనివాస్ అకృత్యాలకు అంతే లేదంట!

Posted: 01/03/2018 05:51 PM IST
Gajal srinivas few more videos

యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి, ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన మరిన్ని వేధింపుల వీడియోలు వెలుగుచూశాయి. బాధితురాలు స్వయంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో తీసి బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే బెడ్ పై అభ్యంతరకర స్థితిలో శ్రీనివాస్ పడుకొని ఉండగా, ఓ మహిళ ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో చక్కర్లు కొడుతుండగా, తాజాగా మరో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధితురాలు మొత్తం 10 వీడియోలను పోలీసులకు అందించింది. వీటిల్లో కొన్ని పోలీసు వర్గాల ద్వారానే మీడియాకు చేరడం గమనార్హం. ఆలయవాణి కార్యాలయాన్ని బ్రోతల్ హౌస్ గా మార్చిన శ్రీనివాస్, పలువురు అమ్మాయిలను అక్కడకు తెచ్చుకున్నట్టు ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతోంది.

గంటల కొద్దీ నిడివిగల వీడియోలను బాధితురాలు పోలీసులకు అందించగా, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, ఆయనపై మరిన్ని సెక్షన్లను జోడించే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో పీఏను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

బెయిల్ ఇవ్వొద్దు.. పోలీసుల విజ్నప్తి

నాంప‌ల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే, ఆయ‌న‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల‌ను తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అలాగే పోలీసులు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను ఏడు రోజుల క‌స్ట‌డీకి కోరారు. ఇరు పక్షాల న్యాయ‌వాదుల వాద‌న‌లు విన్న కోర్టు ఈ పిటిష‌న్‌ల‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు ఈ కేసులో మ‌రిన్ని సాక్ష్యాల కోసం ఆరా తీస్తున్నారు.

అసలు రూపంపై బాధితురాలు

సేవ్ టెంపుల్ కార్యాల‌యంలో గాయ‌కుడు గ‌జ‌ల్ శ్రీనివాస్ త‌న‌ను త‌రుచుగా పిలిచేవాడని, అస‌భ్య‌క‌రంగా చూసేవాడని బాధితురాలు చెప్పారు. కొన్ని నెల‌లుగా ఆయ‌న త‌న ప‌ట్ల అభ్యంత‌రక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. రెండు నెల‌లుగా వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని తెలిపారు. గ‌జ‌ల్ శ్రీనివాస్ త‌న‌ను చాలా స‌మ‌యం ఆయ‌న ముందే కూర్చోమ‌ని చెప్పేవారని అన్నారు. తాను చేస్తోన్న ప‌ని ప‌రంగా రాత్రి పూట కార్యాల‌యంలో ఉండే అవ‌స‌రం లేదని, సాయంత్రం 6 గంట‌ల‌కు ప‌ని అయిపోయేదని, వెళ్లిపోయేదాన్నని బాధితురాలు తెలిపారు.

సాయంత్రం స‌మ‌యంలో త‌న‌ను పిలిచి ఇంకాస్త స‌మ‌యం ఉండ‌మ‌ని బ‌ల‌వంత పెట్టేవాడని అన్నారు. ఈ కేసులో పోలీసులు బాగానే స్పందిస్తున్నారని చెప్పారు. ఆల‌య‌వాణిలో చేరాకే త‌న‌కు గ‌జ‌ల్ శ్రీనివాస్ ప‌రిచ‌యం అయ్యాడని అన్నారు. అధిక స‌మ‌యం ఉండ‌బోన‌ని ఓ సారి చెప్పానని, త‌న‌ను బెదిరించాడ‌ని, ఓ సారి బాగా తిట్టాడ‌ని అన్నారు. ఎక్కువ సేపు మాట్లాడుతూ అస‌భ్య‌క‌రంగా త‌న‌ను చూస్తూ ఉండేవాడని చెప్పారు. తర్వాత అసలు వ్యవహారం బయటపడిందని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే అతన్ని స్థానం నుంచి తప్పించనట్లు ఆలయ పరిరక్షణ కమిటీ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles