cid arrests nine in idol missing case దేవుడికే పంగనామాలు పెట్టేశారు..ఇలా చిక్కారు

Mine arrested in ekambareswara temple idol missing case

panchaloha idols, muruga idol, idols made of gold, Somaskandar idol, kancheepuram, ekambareswara temple, temple stapathi, manager, nine arrested idol missing case, tamil nadu cid wing, siva kanchi, tamil nadu

After cases relating to the missing idols of Sri Ekambaranathar temple, Kancheepuram, have been transferred to the Idol Wing CID, nine arrests were made including stapadi and temple manager.

దేవుడికే పంగనామాలు.. బంగారు విగ్రహాలను తస్కరణ..

Posted: 01/03/2018 11:07 AM IST
Mine arrested in ekambareswara temple idol missing case

సన్మార్గుల ముసుగులో ఉన్నత పదపులను చేతబట్టి.. బద్దివక్రించి.. దేవుడికే పంగనామాలు పెట్టిన ఘనులకు తమిళనాడు సిఐడీ అరదండాల వేసి కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలో భక్తుల అనుమానాలు నిజమయ్యాయి. ఆలయ అధికారుల మోసానికి పాల్పడి దేవుడి సొమ్మను కూడా దోచుకున్నారు. దీనిపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడం, ఏకంగా న్యాయస్థానాలనే అశ్రయించడంతో.. మొత్తం వ్యవహారం భయటకువచ్చింది.

కాంచీపురంలోని పురాతనమైన ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మవారికి బంగారు నగలు బదులు గిల్ట్ నగలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. ఈ సంఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మ వారికి నగలు చేయించేందుకు ఆలయకమిటీ నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందజేయగా, బంగారు నగలు తయారు చేసి దేవతా విగ్రహాలకు అలంకరించడం జరిగింది. ఇదిలా ఉంచితే, తాజాగా పట్టణంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు పంచలోహ విగ్రహాలు దొరికాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు, ఈ విగ్రహాల విషయమై విచారణ ప్రారంభించగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోవని పోలీసుల విచారణలో బయటపడింది.

ఆలయంలోని పంచలోహ విగ్రహాలను బయట తాకట్టుపెట్టి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలను ఉంచినట్టు తేలింది. దీంతో పాటు మరో ఆశ్చర్యకర విషయం కూడా వెలుగు చూసింది. ఆలయంలోని బంగారు నగలను తాకట్టుపెట్టి వాటి స్థానే గిల్ట్ నగలను ఉంచినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles