short film director yogi molested even top hero wife డైరెక్టర్ యోగికి వేధింపుల జాబితాలో ఆ నటుడి భార్య కూడా..!

Short film director yogi molested even top hero wife alleges harika

harika, short film, awardee director, yogi, actress, jd chakravarthy, anukeerthi, gangireddy, cyberabad police, telangana, crime, latest news

tollywood actress harika alleges that short film director yogi nature is molesting actresses, she alsg said that he had even molested tollywood top hero's wife.

డైరెక్టర్ యోగికి వేధింపుల జాబితాలో ఆ నటుడి భార్య కూడా..!

Posted: 12/23/2017 02:41 PM IST
Short film director yogi molested even top hero wife alleges harika

అవార్డు లఘు చిత్రాల దర్శకుడైన యోగి, తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక ఇవాళ మరో సంచలన విషయాన్ని కూడా బహిరంగపర్చారు. డైరెక్టర్ యోగి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందిన నటుడు భార్యను కూడా వేధించాడని నటి హారిక ఇవాళ ఈ విషయాన్ని మీడియా ముఖంగా స్పష్టం చేసింది. నటి అనుకీర్తిపై కూడా వేధింపులకు పాల్పడ్డాడని అమె అరోపించారు.

ఈ మేరకు అనుకీర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని కేసు ప్రస్తుతం కో్ర్టు విచారణలో వుందని కూడా తెలిపారు. ఓ షార్ట్ ఫిల్మ్ లో అమెను అభ్యంతరకరంగా, అసభ్యకరంగా నటించమని ఒత్తిడి చేశాడని.. ఇలా వేధింపులకు పాల్పడినందుకు అమె గత ఏడాది (2016) జూలైలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. అదే సంవత్సరంలో నటుడు జేడీ చక్రవర్తిని అనుకీర్తి వివాహం చేసుకుంది.
 
తన వద్ద డబ్బులు తీసుకుని.. అడిగినా ఇవ్వడం లేదని, పైగా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని యోగిపై హారిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హారిక ఫిర్యాదుతో యోగిని స్టేషన్‌కు పిలిపించగా.. పోలీసుల ఎదుటే హారికను యోగి అసభ్యకరంగా దూషించడం గమనార్హం. యోగి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు పలు విధాలుగా విచారిస్తూ పాత కేసులను బయటకు తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles