Sonia Gandhi retires ahead of Rahul Gandhi takeover రాజకీయాలకు.. కాంగ్రెస్ కు ‘‘అమ్మ రాజీనామా..’’

Sonia gandhi retires ahead of rahul gandhi takeover as congress president

sonia gandhi retires, sonia gandhi retirement, sonia gandhi congress, sonia gandhi news, sonia gandhi latest news, news, Congress, rahul gandhi, sonia gandhi, retirement, Congress, rahul gandhi, party president, politics

Ahead of her son Rahul Gandhi’s slated takeover as the Congress president, outgoing President Sonia Gandhi, on Friday, told reporters that she will now retire from politics.

రాజకీయాలకు.. కాంగ్రెస్ కు ‘‘అమ్మ రాజీనామా..’’

Posted: 12/15/2017 01:11 PM IST
Sonia gandhi retires ahead of rahul gandhi takeover as congress president

రాజకీయాల నుంచి అమ్మ రాజీనామా చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల పాలిట దశాబ్దాలుగా వున్న కలను సాకారం చేసిన పెద్దమ్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు.  తన కుమారుడు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక రోజు ముందు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోనే ప్రాచీన పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ పార్టీకి సోనియా గాంధీ 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కాంగ్రెస్ కుటుంబంలోని నేతలు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి.

మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇలా చేయడం ఇప్పటి వరకు ఎరుగము. అందుకు వారికి అవకాశం కూడా కలగలేదు. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి పదవిలో వుండగానే అమె భద్రతా పర్యవేక్షణ దళంలోని ఓ సభ్యుడే అమెను తుపాకీతో కాల్చి చంపడంతో అమె పదవిలో వుండగానే పరమపదించారు. ఇక ఆ తరువాత అమ్మకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీని కూడా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళానాడులో పర్యటిస్తుండగా, అక్కడ ఎల్టీటీఈకి చెందిన ఉగ్రవాదులు బెల్టుబాంబుతో అత్మహుతి దాడికి పాల్పడి హతమార్చారు. ఆ తరువాత తాను రాజకీయాలకు దూరంగానే వుంటానని నిర్ణయం తీసుకున్న సోనియా.. అలాగే చేశారు.

అయితే దేశంలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణిస్తున్న క్రమంలో అమె గత్యంతరం లేని పరిస్థితుల మధ్య 1997లో కొలకతా ప్లీనరీ సమావేశాల అనంతరం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ తరువాత 1998లో అమె పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలను చేపట్టారు. అలా ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. 2004 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సోనియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావించారు. కానీ అమె అందుకు దూరంగా వున్నారు. 2009లో మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అయన కనీసం మంత్రి పదవిని కూడా స్వీకరించలేదు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ సీనియర్ నేత.. అర్థిక శాఖ కోవిదుడైన మన్మోహన్ సింగ్ నే ప్రధానిగా చేశారు.

కాగా, గత కొన్నేళ్లుగా పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 47 ఏళ్ల రాహుల్ గాంధీ శనివారం పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కొంత సతమతం అవుతున్న సోనియాగాంధీ.. రాజకీయాలకు వీడ్కోలు పలకడంతో ఇక తన అరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇదిలావుండగా, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఈ బాధ్యతలను స్వీకరిస్తోన్న ఆరో వ్యక్తి రాహుల్ కావడం విశేషం. గుజరాత్, హిమాచప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనుండగా.. అందుకు రెండు రోజుల ముందే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  retirement  Congress  rahul gandhi  party president  politics  

Other Articles