pakistan girl forced to walk naked through village పాక్ లో అంతే.. బాలికను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

14 year old girl paraded naked in pakistan s village

Pakistan,girl paraded naked,girl punished brother had affair,extramarital affair Pakistan,teenage girl stripped,teenage girl punished for brother,girl stripped paraded naked Pakistan village,family honour,extra-marital affair in pakistan

A teenage girl in Pakistan's Garahmat village was forced to strip down and walk naked through streets as a punishment because her elder brother had an affair with a girl.

పాక్ లో అంతే.. బాలికను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

Posted: 11/03/2017 01:37 PM IST
14 year old girl paraded naked in pakistan s village

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ.. వారికి స్వర్గధామంగా నిలుస్తున్న పాకిస్థాన్ లో అటవిక రాజ్యం, అటవిక పాలన, అనాగరిక తీర్పులు రాజ్యమేలుతున్నాయి. అరాచకానికి అడ్డాగా మారిన దాయధా దేశంలో ప్రపంచం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. మగవారు చేసే అనైతిక కార్యక్రమాలకు కూడా వారింటిలోని అడవారిని శిక్షించడం అక్కడ అనవాయితా మారింది. తప్పు చేసిన వాడిని వదిలేసి.. అమాయక అబలలపై అటవిక తీర్పులు చెబుతూ వారి మానమర్యాదలను బజారుకీడుస్తున్నారు.

ఓ మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఆ యువకుడు పరారీలో వున్న సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించి బదులు తీర్చుకున్నారు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఓ గ్రామంలో జరిగింది. ప్రావిన్సులోని గ్రామీణ అనధికార చట్టాలు విధిస్తున్న శిక్షలు ఇటీవల చాలా కఠినంగా మారాయి. ‘పరువు’ పేరుతో ప్రతి ఏడాది వందలాది మంది మహిళల ప్రాణాలను ఈ పంచాయితీలు తీసేస్తున్నాయి.

తాజా ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పింది. అక్టోబరు 27న బాలికకు స్నానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా తిప్పుతూ ఊరేగించారు.

దేశంలో ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, మూడు నెలల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి సోదరిని అందరూ చూస్తుండగా రేప్ చేయాలంటూ విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 14 yrs girl  stripped naked  marched naked  garahmat village  dera ismail khan  pakistan  

Other Articles