IPS Kareem Open Up about Hitech Copying | ఐపీఎస్ ‘మున్నాభాయ్’ అసలు విషయం చెప్పాడు

Ips officer copying case details

Safeer Karim, Safeer Karim Copying, IPS Safeer Karim, IPS Munna Bhai, Safeer Karim Wife, Safeer Karim Lost Job, Safeer Karim Arrest, Safeer Karim Joicy Joy, Joicy Joy About Husband, Joicy Joy Help IPS, Joicy Joy Karim

IPS officer Safeer Karim Open up Why try to copying in Exam. After Wife Joicy Joy Arrest, this IPS Officer May Lose Job. Officials suspect that he might have used hi-tech tools for copying in other exams too.

కాపీ కరీం.. విచారణలో ఏం చెప్పాడు

Posted: 11/01/2017 09:41 AM IST
Ips officer copying case details

హైటెక్ కాపీయింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి పరువు తీసుకున్న ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం.. భార్య జోయ్ అరెస్ట్ కు కారణం కావటమే కాదు.. చివరకు తన ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు.కేంద్ర హోం శాఖ దృష్టికి ఈ అంశం చేరటంతో ఇప్పటికే కరీంపై మున్నాభాయ్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఐపీఎస్ అధికారిగా ఉంటూ ఐఏఎస్ కోసం ఎందుకిలా చేశాడన్న దానిపై కరీం నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మళయాళ సూపర్ హిట్ చిత్రం 'కమిషనర్'లోని హీరో పాత్ర కరీంకు ఆదర్శం. అందుకే కష్టపడి చదివి 2015లో సివిల్స్ లో 112వ ర్యాంకు సంపాదించుకున్నాడు. పోలీసు శాఖపై ఉన్న మక్కువతో ఐఏఎస్ ను వదులుకున్న అప్పుడు ఐపీఎస్ వైపు వెళ్లాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఓ యాక్సిడెంట్ లో కరీంకు గాయపడ్డాడు. తాను ఇక ఐపీఎస్ కు పనికిరానని, కూర్చుని చేసుకునే ఐఏఎస్ కు వెళ్లాలని భావించాడు.

అప్పటికి రెండు సార్లు సివిల్స్ పరీక్షలకు హాజరైనందున కరీంకు మరొక్క చాన్స్ మాత్రమే ఉంది. ఆ చాన్స్ పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో భార్య జోయ్ తో కలిసి ఈ కాపీయింగ్ ఫ్లాన్ వేశాడు. హైదరాబాద్ లో పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే గత పరీక్షలకు కూడా ఇతను ఇదే రీతిలో కాపీయింగ్ కు పాల్పడడ్డా? అన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు. ప్రస్తుతం తిరునల్వేలి జిల్లా నంగునేరి సబ్ డివిజన్ ఏఎస్పీగా పని చేస్తున్న కరీంపై దర్యాప్తులో నేరం రుజువైతే ఉద్యోగం కోల్పోవటంతోపాటు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles