TTDP Letter to Chandrababu Over Revanth Reddy Oust | ముదిరిన వివాదం, రేవంత్ పై వేటుకు బాబుకు ఎల్ రమణ లేఖ.. రేవంత్ ఛాలెంజ్

Revanth reddy issue in ttdp

TTDP, TTDP Revanth Reddy Termination, Revanth Reddy Sack, Revanth Reddy Oust, TTDP Revanth Reddy, Revanth Reddy Issue, Revanth Reddy Chandra Babu Naidu, TTDP Revanth Reddy Remove, TTDP L Ramana Revanth Reddy, Revanth Reddy Ramana, TTDP Ramana Letter Chandrababu, Revanth Reddy Unofficial Ban

The high drama in TTDP. Telangana unit of TDP wrote letter to Party Chief Nara Chandrababu Naidu. Asks To strip Revanth Reddy, off the posts of working president and floor leader in the State Assembly with immediate effect. Revanth Challange TTDP Leaders and Decided to conduct TDP Legislature Meet in Assembly.

అనధికార బహిష్కరణ.. రేపు రేవంత్ మీటింగ్

Posted: 10/25/2017 12:03 PM IST
Revanth reddy issue in ttdp

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వివాదం మరింతగా ముదిరేలా కనిపిస్తుంది. రేవంత్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయటం.. ఆ వెంటనే రేవంత్ స్పందనతో రసవత్తరం పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించవద్దని రేవంత్ ను ఆదేశించిన రమణ, నేతలకు రేవంత్ కు దూరంగా ఉండమంటూ సూచించినట్లు సమాచారం. టీడీపీ విదేశాల నుంచి తిరిగొచ్చి నిర్ణయం తీసుకునేదాకా ఈ ఆజ్నలు పాటించాలని కేడర్ ను రమణ ఆదేశించారు.

టీడీపీ నిర్వహించే సమావేశాలకు రేవంత్ రెడ్డి రానవసరం లేదని, సమావేశాలకు ఆయనకు అనుమతి లేదని ఎల్ రమణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత వారంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలను, టీడీపీ ఎల్పీ సమావేశంలో జరిగిన సంభాషణల గురించి నివేదిక ఇచ్చిన ఎల్ రమణ, రేవంత్ వంటి నేత ఇక వద్దని, ఆయనపై వెంటనే వేటు వేయాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. రేవంత్ పార్టీ మారడం ఖాయమని, ఈ లోగా సాధ్యమైనంత మేరకు టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కాబట్టి ముందే నిర్ణయం తీసుకుందామని కూడా రమణ సూచించినట్టు సమాచారం. అంతేకాదు చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు.

దీంతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవుల నుంచి రేవంత్ తొలగింపు ఖాయమనే సంకేతాలు కూడా అందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న చంద్రబాబు, నేటి రాత్రికి ఇండియాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తరువాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్ ‘వేటు’పై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

రేవంత్ ఎదురు దాడి...

తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకుని రోజుకో మాట మాట్లాడుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి పార్టీ నేతలపై ఎదురు దాడికి దిగాడు. వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ నేత హోదాలో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కు కాల్ చేశారు. రేపు ఉదయం అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ సమావేశానికి రావాలని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.

తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉంటారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం టీడీపీ తరఫున రేవంత్ తో పాటు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మిగతావారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక వీరిద్దరిలో ఎవరు రేపు రేవంత్ వెంట నిలుస్తారన్నది ఆసక్తికరం. ఇదిలా ఉంటే రేవంత్ మూలంగానే బీజేపీ తో విభేధాలు తలెత్తాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు సాయంత్రం గోల్కోండ హోటల్ లో టీటీడీపీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles