cbi court denies exemption from court attendence to jagan సీబీఐ కోర్టులో వైసీపీ అధినేతకు చుక్కెదురు

Cbi court denies exemption from court attendence to jagan

CBI court denies exemption to YSRCP president YS Jagan, ys jagan petition rejected in court, Cbi court, slight exemption, YSRCP president, YS Jagan, disappropriate assets case, cbi lawyer, once in 4 weeks

CBI court denies exemption to YSRCP president YS Jagan from attending court every friday on his disappropriate assets case, after agreeing with cbi lawyer arguments.

సీబీఐ కోర్టులో వైసీపీ అధినేతకు చుక్కెదురు

Posted: 10/23/2017 02:49 PM IST
Cbi court denies exemption from court attendence to jagan

సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. అక్రమాస్థుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం సీబిఐ న్యాయస్థానంలో హాజరవుతున్నారు. అయితే రాష్ట్రంలో తాను ప్రధాన ప్రతిపక్షంగా వున్న కారణంగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు.. ఆపై ప్రజా సమస్యలను క్షేత్ర స్థాిలో తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు.

జగన్ వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు పిటీషన్ ను తోసిపుచ్చింది. కేసు విచారణలో వుండగా, నిందితుడికి  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కల్పించలేమని తేల్చిచెప్పింది. వారానికి ఒకరోజు హాజరు నుంచి వైసీపీ అధినేతకు ఎలాంటి మినహాయింపును కల్పించలేమని తీర్పను వెలువరింది. ఈ సందర్భంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. ఈ క్రమంలో న్యాయస్థానం సిబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది.

అక్టోబర్ 2 నుంచి మే 2 వరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు వ్యక్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ వేసిన పిటిష‌న్‌పై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. జగన్ న్యాయవాది వాదనలతో పాటు సీబిఐ తరపు వాదనలను కూడా విన్న న్యాయస్థానం.. సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జయబాలన్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జగన్ కు ఈ సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కల్పించలేమని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles