Student stabbed colleague with knife in college campus తోటి విద్యార్థిపై ఇంజనీరింగ్ విద్యార్థి దాడి.. పరిస్థితి విషమం

Student stabbed colleague with knife in college campus

student quarrel, stabbing, bhuvaneshwar, rohit, whatsapp, btech students group, mysammaguda, narasimhareddy college, medchal, pet basheerabad police, telanagana, crime

A BTech third Year studen rohit, from narasimha reddy engineering college mysammaguda, near medchal had stabbed his colleague bhuvaneshwar in college campus.

తోటి విద్యార్థిపై ఇంజనీరింగ్ విద్యార్థి దాడి.. పరిస్థితి విషమం

Posted: 10/21/2017 09:32 AM IST
Student stabbed colleague with knife in college campus

విద్యార్థులలో నేరప్రవృత్తి పెరుగుతూ పోతుందని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తుపై అనేక అశలతో రాణించాల్సిందిపోయి.. చిన్నాచితక విషయాలకు ఏకంగా కత్తులతో వచ్చి తోటి విద్యార్థిపై దాడికి తెగబడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. మేడ్చల్ సమీపంలోని మైసమ్మగూడ వద్ద నున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థికి కూడా రక్తపు గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు శివారు మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రోహిత్‌ (20), భువనేశ్వర్‌ (20), వైభవ్ (20) లు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఒకే తరగతి కావడంతో కళాశాలలోని ఇతర స్నేహితులతో కలిసి వాట్స్ యాప్ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్‌ ల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దీపావళి రోజు రాత్రి ‘రేపు (శుక్రవారం) రోహిత్‌ ను నేను కొట్టబోతున్నాను’ అంటూ భువనేశ్వర్ వాట్స్ యాప్ గ్రూపులో మెసేజ్‌ పెట్టాడు.

దీనిని చదివిన రోహిత్‌ నిన్న ఉదయం తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. అప్పుడే బస్సులో కళాశాలకు వచ్చిన భువనేశ్వర్ పై కత్తితో దాడి చేశాడు. స్నేహితులు భువనేశ్వర్ చేతులు పట్టుకోగా రోహిత్ దాడికి దిగాడు. దీంతో భువనేశ్వర్ ముఖం, చేతులు, నడుముకు గాయాలయ్యాయి. దీనిని చూసిన వీరి మిత్రుడు వైభవ్ ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీన బాధితులను ఆసుపత్రికి తరలించారు.

దీనిపై సమాచారం అందడంతో హైదరాబాదు శివారు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. దీనిపై క్షతగాత్రుడు భువనేశ్వర్ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థి కత్తులతో కళాశాలలో ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. చదువుకోసం కళాశాలకు వెళ్తున్నారా? లేక గూండాలుగా మారేందుకు వెళ్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. కాగా, భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : engineering student  stabbing  bhuvaneshwar  rohit  whatsapp  narasimhareddy college  medchal  telanagana  crime  

Other Articles