Orissa lawyers to protest CBI entry into sitting judge’s house సీబీఐ బ్లండర్ మిస్టెక్.. రిటైర్డుకు బదులు సిట్టింగ్ ఇంట్లోకి..

Orissa lhc bar association to protest cbi entry into sitting judge s house

cbi raids former judge house, former orissa hc judge im quddusi’s house raided, former judge's house raided in mci scam, central bureau of investigation (cbi), justice im quddusi, mci recognition to colleges, medical council of india (mci). orissa high court, latest news

Protesting the entry of CBI personnel into the house of a sitting judge at Cantonment Road area of the city, the Orissa High Court Bar Association afternoon launched a cease work agitation till afternoon.

సీబీఐ బ్లండర్ మిస్టెక్.. రిటైర్డుకు బదులు సిట్టింగ్ ఇంట్లోకి..

Posted: 09/21/2017 12:30 PM IST
Orissa lhc bar association to protest cbi entry into sitting judge s house

అవినీతి అధికారులు బ్లండర్ మిస్టేక్ చేశారు. రిటైర్డ్ జడ్జి ఇంట్లోకి వెళ్లి దాడులు నిర్వహించాల్సి వుండగా, అందుకు భిన్నంగా సిట్టింగ్ జడ్జి నివాసంలోకి వెళ్లి ఆకస్మిక దాడులు నిర్వహించడం అందోళనకు దారితీసింది. ఈ ఘటనతో భువనేశ్వర్ లోని న్యాయమూర్తులు అందోళనకు దిగారు. సీబిఐ అధికారులు తమ పరిధి దాటి సిట్టింగ్ జడ్జీల నివాసంలోకి ఎలా వస్తున్నారని ప్రశ్నిస్తూ.. విధుల బహిష్కరణకు దిగారు. ఈ ఘటనపై జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

 సీబీఐ అధికారుల దాడుల్లో ఒక ఇల్లు బదులుగా మరో ఇంటిలోకి చొరబడి సీబీఐ గిరీ ప్రదర్శించారు. అంతే కథ అడ్డం తిరిగింది. అదో సిట్టింగు న్యాయమూర్తి అధికారిక నివాస భవనమని తెలుసుకున్న అధికారులు నాలుక కరుచుకుని అక్కడి నుంచి నిష్ర్కమించారు. అయితే విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టామని అధికారులు చెబుతన్నారు. కానీ దానిని విశ్వసించని న్యాయవాదులు సీబిఐ అధికారులు తమ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని దుయ్యబడుతున్నారు.

రాష్ట్రంలో సిట్టింగు ఎమ్మెల్యే ప్రభాత్‌ రంజన్‌ బిశ్వాల్‌ చిట్‌ఫండ్‌ మోసాల్లో నిందితునిగా అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు బృందం కటక్‌ మహా నగరంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా సీబీఐ అధికారులు పొరపాటుపడి.. విశ్రాంత న్యాయమూర్తి ఇంట్లో జరపాల్సిన దాడులను.. సిట్టింగ్ జడ్జి నివాసంలో జరిపారు. అంతే ఇంకేముంది.. విషయం తెలిసిన న్యాయవాదులు రోడెక్కారు.

అందోళనతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు తదుపరి కార్యచరణ రూపోందించే వరకు విధులను బహిష్కరిస్తున్నామని, ఈ మేరకు ఒడిశా హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిందని తెలిపారు. తక్షణమే విధుల్ని బహిష్కరిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. విధుల బహిష్కరణ తదుపరి సర్వసభ్య సమావేశం తీర్మానం వరకు నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

హై కోర్టు సిట్టింగు న్యాయమూర్తి సి.ఆర్‌.దాస్‌ ఇంట్లోకి చొరబడడం సంఘవిద్రోహంగా హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ వ్యాఖ్యానించింది. ఈ విచారకర సంఘటనపై హై కోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన జుడీషియల్‌ దర్యాప్తునకు డిమాండ్‌ చేసింది. తప్పటడుగు వేసిన అధికారులు, సిబ్బందిని గుర్తించిన మేరకు వారి వ్యతిరేకంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో క్రిమినల్‌ ప్రొసీడింగ్సు చేపట్టాలి. బాధ్యుతలైన వారిని విధుల నుంచి సస్పెండు చేయడం అనివార్యంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతిపాదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles