22 drown as boat capsizes in Yamuna river 28 మందిని గంగ, యమున బలి తీసుకున్నాయి..

28 die in two separate tragic incidents in rivers yamuna ganga

Boat capsize, Boat capsize news, Boat capsize in up, Boat capsize bihar, Boat capsize baghpat, baghpat Boat capsize, Boat capsize in yamuna, Boat capsize in river yamuna, Boat capsize in river ganga, Boat capsize in ganga, deaths in Boat capsize, Boat capsized in yamuna, Boat capsized in uttar pradesh

At least 22 people killed after a boat carrying 60 capsized in river Yamuna in Uttar Pradesh’s Baghpat on Thursday. In a separate incident, 6 people were killed after drowning in river Ganga in Bihar’s Maranchi.

28 మందిని గంగ, యమున బలి తీసుకున్నాయి..

Posted: 09/14/2017 01:07 PM IST
28 die in two separate tragic incidents in rivers yamuna ganga

దేశంలోని పవిత్ర నదీమ తల్లులు మానవమాత్రులను మింగుస్తున్నాయి. ఇవాల ఒక్కరోజు రెండు వేర్వురు ప్రాంతాల్లో జరిగిన ఘటనలను చూస్తే.. ఇది నిజమే అనిపిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ తో పాటు బీహార్ లోని మరాంచీలో రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ లో యుమునా నదిపై సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడక మునిగిపోయింది. ఈ ఘటనలో 19 మంది ఘటనాస్థలంలోనే నీట మునిగి మృత్యువాత పడ్డారు.

కాగా, ఆ తరువాత కూడా ఇంకా 3 గల్లంతయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. కాగా మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్‌ భవాని సింగ్‌ తెలిపారు. ఘటనాన్థలంలో గాలింపు చర్యలను చేపడుతున్న అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. పడవ మునక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇక మరో ఘటన బీహార్ లోని మరాంచి లో చోటుచేసుకుంది. గంగా నదిలపై నాటు పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రమాదం బారిన పడి మరణించారు. మరాంచికి లో గంగా నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న అరుగురు గంగా నదిలో మునిగిపోయారు.

రాష్ట్రపతి, సీఎం దిగ్భ్రాంతి

యమునా నదిలో పడవ ప్రమాద ఘటనపై 22 మంది, గంగా నదిలో ఆరుగురు పడవ మునిగి చనిపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boat capsize  baghpat  river yamuna  river ganga  bihar  uttar pradesh  tragedy news  

Other Articles