Hopeful of Governors Good Decision says Dinakaran సముచిత నిర్ణయమే వస్తుంది.. పళని పని ఖాళీ..!

Hopeful of guv s good decision on demand for palaniswami s ouster dinakaran

aiadmk, K Palaniswami, T T V Dinakaran, Sasikala, O.Panneerselvam, Vidya Sagar Rao, Thangatamilselvan, ‪Edappadi K. Palaniswami, BJP, DMK, PM Modi, Amit Shah, Tamil Nadu, politics

Describing the governor as a "legal expert", Dinakaran told reporters in Chennai that "justice", for which his loyalists had taken up cudgels against the incumbent dispensation led by Palaniswami, "will win"

సముచిత నిర్ణయమే వస్తుంది.. పళని పని ఖాళీ..!

Posted: 08/26/2017 03:49 PM IST
Hopeful of guv s good decision on demand for palaniswami s ouster dinakaran

తమిళనాడులో రాజకీయాలు సమీకరణలను అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార అన్నాడిఎంకేలో సర్కారులో వున్న పళనిస్వామి వర్గం.. పన్నీరు సెల్వం వర్గంతో స్నేహహస్తం ప్రకటించిన తరువాత మరో వర్గమైన టీటీవీ దినకరణ్ ఈ విలీనాన్ని పూర్తిగా వ్యక్తిరేకిస్తూ పళనిస్వామి తమ నమ్మకాన్ని కోల్పోయాడని ఆయన వర్గం ప్రకటించిన నేపథ్యంలో  అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఈ వర్గం నీడన చేరడంతో.. అదికార ప్రభుత్వం తాజాగా ప్రమాదపుటంచున చేరింది.

ఈ నేపథ్యంలో తొలుత 19 మంది దినకరణ్ పక్షానికి చేరగా క్రమక్రమంగా చాలమంది అన్నాడీఎంకే నుంచి తమ వర్గానికి చేరుతారని ఆ పార్టీ నాయకులు చేబుతున్న మాటలు నిజమవుతున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీటీవీ దిన‌క‌ర‌న్ కు మ‌ద్ద‌తు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి పళని సామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆందోళ‌న చెందుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో అర్థం కాక అయోమ‌యానికి గుర‌వుతున్నారు.

మరోపక్క విరుతచలం నియోజక వర్గం శాసన సభ్యుడు కలైసెల్వం శనివారం చెన్నై లోని టీటీవీ దినకరన్ ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఇటీవల మళ్లీ పార్టీలోకి వచ్చిన పన్నీర్ సెల్వంకు అధిక‌ ప్రాధాన్యత ఇస్తున్నారని, అది స‌హించ‌లేక దిన‌క‌ర‌న్‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు క‌లైసెల్వం పేర్కొన్నారు. త‌న లాగే ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్య‌మంత్రి చ‌ర్య‌ల వ‌ల్ల అసంతృప్తికి లోన‌వుతున్నార‌ని, వారు కూడా త్వ‌ర‌లోనే దినకరన్‌కు మ‌ద్ద‌తివ్వ‌డానికి ముందుకు వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డానికి ప‌ళ‌ని సామి వ‌ర్గం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aiadmk  K Palaniswami  T T V Dinakaran  Sasikala  O.Panneerselvam  Vidya Sagar Rao  Tamil Nadu  politics  

Other Articles