ట్రంప్ అనుకున్నంత పని చేసేశాడు.. వాళ్లకు ఆర్మీలో నో ఛాన్స్ | Trump's ban on transgender troops is now official policy

Trump bans transgender recruits from military

President Donald Trump, Trump Transgender, US Military Transgenders, US Military Ban, Donald Trump Transgender Policy, Trump Sign Memo, USA Military Anti Transgender Bill

President Donald Trump has formally signed a presidential memo directing the Pentagon to ban transgender people from joining the US military, following through on a policy he announced on Twitter back in July. The presidential memo, issued late Friday evening a plan to implement the new policy by February 21, 2018.

ఆర్మీలో హిజ్రాలు.. ఇక జాన్తానై

Posted: 08/26/2017 10:46 AM IST
Trump bans transgender recruits from military

రక్షణ శాఖకు సంబంధించి మరో సంచలన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. ట్రాన్స్ జెండర్(హిజ్రాలు) ఆర్మీలో చేరటానికి వీల్లేదన్న ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేశారు. ఈ మేరకు రక్షణ శాఖా కార్యాలయం పెంటగాన్ కు వైట్ హౌజ్ నుంచి ఉత్తర్వులు అందుకున్నాయి.

అమెరికా మిలిటరీ రంగంలో హిజ్రాల నియామకాలను నిషేధిస్తామంటూ గతంలోనే ట్రంప్ ప్రకటించారు. ఆపై ట్రంప్ ప్రకటనను వ్యతిరేకిస్తూ హిజ్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కన్నీటిపర్యంతం అవుతూ తమ ఆవేదనను వెల్లగక్కారు. అయినా, ట్రంప్ మనసు కరగలేదు. మిలిటరీలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలిటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా తొలి నుంచి ట్రంప్ వాదిస్తూ వస్తున్నాడు.

చివరకు దేశీయ మిలిటరీలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలపై సంతకం చేశారు. దీంతో, రక్షణ సేవల్లో హిజ్రాల సేవలు, వారి నియామకాలు రద్దవబోతున్నాయి. హిజ్రాలకు కేటాయిస్తున్న నిధులను వెంటనే ఆపివేయాలని దేశీయ డిఫెన్స్ డిపార్ట్ మెంట్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని హిజ్రా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  President Donald Trump  USA Military  Anti Transgender Bill  

Other Articles