వణికిపోయిన భాగ్యనగరం.. 8 గంటలు నాన్ స్టాప్ వాన.. నరకం | Heavy Rains Hits Hyderabad

Hyderabad to witness heavy rainfall

Hyderabad Heavy Rains, Twin Cities Heavy Rains, Hyderabad Secunderabad Rains, Hyderabad Monsoon

Heavy Rains have evaded Telangana as well as Hyderabad. 8 hours Continuous Heavy Rains in Hyderabad.

జంట నగరాలను వణికిస్తున్న వరుణుడు

Posted: 08/26/2017 08:53 AM IST
Hyderabad to witness heavy rainfall

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తు్నాయి. ముఖ్యంగా జంట నగరాలు హైదరాబాద్‌ సికింద్రాబాద్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. మధ్యమధ్యలో చిన్నపాటి బ్రేకులిచ్చినా పూర్తిగా తెరిపినివ్వడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారంపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరం తడిసిముద్దైంది. అత్యధికంగా మాదాపూర్, బాలానగర్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 30 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాన్‌-స్టాప్ వర్షంతో జంక్షన్లు జామయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాలి లోతులో నీళ్లు కనిపిస్తున్నాయి. మొరాయిస్తున్న వాహనాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

 

ప్రధాన జంక్షన్లన్నీ జామయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వినాయక చవితి వేడుకలు జరుగుతుండగానే మండపాలలోకి నీరు చేరడంతో పండుగ వాతావరణం కాస్త ఆవిరైపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా కొన్ని చోట్ల పరిస్థితి దారుణంగానే ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Heavy Rains  Monsoon Season  

Other Articles