Patient dies as BJP leader 'stops' ambulance రోగి ప్రాణాలతో చెలగాటమాడిన నాయకుడు

Haryana bjp leader accused of stalling ambulance causing death

Darshan Nagpal, Haryana BJP leader, Darshan Nagpal accused of stopping ambulance, Darshan Nagpal case, Darshan Nagpal ambulance case, Fatehabad, Fatehabad incident, BJP leader, chandigarh stalking incident, BJP haryana chief, latest news

Harayana BJP leader Darshan Nagpal has been accused of causing death of a patient after he allegedly stopped an ambulance for half an hour when it hit his vehicle in Fatehabad.

రోగి ప్రాణాలతో చెలగాటమాడిన నాయకుడు

Posted: 08/07/2017 08:54 PM IST
Haryana bjp leader accused of stalling ambulance causing death

హర్యానాలో అధికార బీజేపి నేతల అడగాలు శృతిమించిపోతున్నాయి. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సుబాస్ బరాలా కుమారుడు మద్యం మత్తులో జోగుతూ ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె వెంటపడి వేధించిన విషయం మరువక ముందే.. తాజాగా మరో బీజేపి నేత ఏకంగా రోగి ప్రాణాలనే అపహరించి వివాదంలో కూరుకుపోయాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు వేగంగా వెళ్తున్న అంబులెన్సు స్థానిక బీజేపి నేత కారును ఢీకొనడంతో.. అంబులెన్సును అడ్డుకుని తన కారుకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాడు.

అంబులెన్సులో రోగి వున్నాడని, అతని పరిస్థితి విషమంగా వుందని రోగి బంధువులు ఎంతగా ప్రాధేయపడినా వినకుండా అంబులెన్సును సుమారు గంటన్నర పాటు అడ్డుకుని తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఫతేబాద్‌ బీజేపీ కౌన్సిలర్‌ దర్శన్‌ నాగ్ పాల్ పై చేసిన హాంగామాతో అంబులెన్సు నిలిచిపోయిందని దీంతో అందులో తీసుకెళ్తున్న రోగి మరణించాడని మృతుని కుటుంబసభ్యులు ఫతేబాద్ పోలీసుల స్టేషన్ లో పిర్యాదు చేశారు.

దీంతో ఆగ్రహించిన నాగ్‌పాల్‌ అంబులెన్స్ ను గంటన్నర పైగా కదలకుండా అడ్డుకున్నారని మృతుడు నవీన్‌ సోని బంధువులు సీతారాం సోని, అరుణ్‌ సోని ఆరోపించారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా బీజేపీ నేత అమానుషంగా వ్యవహరించడంతో రోగి మరణించాడని నాగ్ పాల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగిని పదిహేను నిమిషాలు ముందుగా తీసుకువచ్చినా తాము బతికించేవారమని అస్పత్రి వైద్యులు చెప్పారని వారు వాపోయారు. కాగా, తాను అంబులెన్సును అపలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. అవి పూర్తిగా అవాస్తవమని నాగ్ పాల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Darshan Nagpal  BJP leader  ambulance  Fatehabad  patient dies  Haryana  

Other Articles