actress charmme complaints on excise conistable సెంటిమెంట్ బ్రేక్: కానిస్టేబుల్ పై నటి చార్మీ ఫిర్యాదు..

Actress charmme molested by conistable in excise office

drugs mafia case, SIT, akun sabarwal, constable srinivas, drugs case, tollywood actress, charmme, excise conistable, srinivas, molest, allegations, telangana, crime

tollywood actress charmme alleges and complaints to excise police officials, that while she was entering excise office conistable srinivas allegedly molested her by touching her.

ITEMVIDEOS: సెంటిమెంట్ బ్రేక్: నటి చార్మీపై కానిస్టేబుల్ లైంగికదాడి

Posted: 07/26/2017 02:11 PM IST
Actress charmme molested by conistable in excise office

టాలీవుడ్ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. వారిని విచారిస్తున్న క్రమంలో భాగంగా తొలిసారిగా ఒక నటి కూడా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు జారీ చేసిన అదేశాల ప్రకారం అమె ఇవాళ అబ్కారీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే గత వారం నుంచి విచారణను ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. పూరీ జగన్నాథ్ మొదలుకుని నవదీప్ వరకు అందరూ ఫాలో అవుతన్న సెంటిమెంట్ కు అమె స్వస్తిపలికి.. తనదైన శైలిలోనే అబ్కారీ కార్యాలయానికి చేరకున్నారు.

ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకుని వారి విచారణలో భగంగా హాజరైన అందరు నటులు తెలుపు రంగు దుస్తుల్లోనే విచారణకు హాజరుకాగా, నటి చార్మీ మాత్రం అందుకు భిన్నంగా నీలం రంగు టాపుతో విచారణకు హాజరయ్యారు. నోటీసులు అందుకున్న వారిలో ఎవరూ ఈ కేసు విచారణ తప్పుగా సాగుతుందని, న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని, బలవంతంగా రక్త నమూనాలను సేకరిస్తున్నారని కోర్టును అశ్రయించనప్పటికీ చార్మీ మాత్రం ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించింది. అయితే కోర్టు పలు సూచనలు చేయడంతో ఇవాళ విచారణకు హాజరైయ్యారు.

ఇదిలావుండగా, తాను ఎక్సైజ్ కార్యాలయంలోకి విచారణ నిమిత్తం హాజరవుతున్న క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తనపై లైంగికదాడి చేశారని అమె ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. తాను ముందుకు నడుస్తున్న సమయంలో కానిస్టేబుల్ వెనుక వైపున చేయి వేశాడని అమె పిర్యాదు చేశారు. తనను అభ్యంతరకరంగా తాకాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని కూడా తెలిపింది. ద్వారం వరకు వచ్చిన తాను లోనికి ఎందుకు రానని.. ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో ఎక్సైజ్ పోలీసులు వుండటంతో వారిని చేథించుకుని వచ్చే క్రమంలో ఈ చర్యలకు కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్పడ్డారని సినీ నటి చార్మీ పిర్యాదు చేసినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drugs case  tollywood actress  charmme  excise conistable  srinivas  molest  allegations  telangana  crime  

Other Articles