indian women catches cobra with naked hand యువతి సాహసాం.. చేత్తో విషనాగును పట్టేసింది..

Brave girl caught a poisonous cobra with naked hands

women catches cobra naked hand, women catches cobra bare hand, woman poisonious cobra, indian brave girl, indian young woman, indian brave lady, indian brave girl, cobra, bare hands, naked hands, plastic box, poisonious snake

indian young woman catches poisonous cobra with bare hands and traps it into a plastic box, this video is viral on social media.

ITEMVIDEOS: యువతి సాహసం.. చేత్తో విషనాగును పట్టేసింది..

Posted: 07/26/2017 11:34 AM IST
Brave girl caught a poisonous cobra with naked hands

వేసవి కాలంలో నిర్జన ప్రాంతాల్లో తలదాచుకునే విషసర్పాలు, తేళ్లు ఇత్యాది క్రమికీటకాలు వ‌ర్షాలు ప‌డ‌గానే తలదాచుకునేందుకు వర్షం పడని ప్రాంతాలకు అంటే జనవాసాల మధ్యకు వచ్చేస్తాయి. ఈ క్రమంలో వాటిని చూసి హడలిపోయే మనుషులు వాటిపై దాడులు చేసి నిర్థాక్షిణ్యంగా చంపేస్తుంటారు. అయితే ఇలా పాములు, తేళ్లు బ‌య‌ట‌కు వచ్చినప్పుడు ఇంట్లో పురుషులు లేకుండా కేవలం మహిళలే వుంటే.. గది నుంచి బయటకు పరుగులు తీసి.. బిగ్గరగా అరుస్తూ.. ఇరుగుపోరుగు వారికి విషయం చెప్పి.. వారి సాయంతో విషజంతువులను చంపేందుకు ప్రయత్నిస్తారు.

కానీ కొందరు మహిళలు వాటిని చూసినా పెద్దగా భయానికి గురికారు. ఇక వాటిని పట్టుకుని బంధించేందుకు కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఎక్కడా, ఎమిటీ అన్న వివరాలు మాత్రం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. పడగ విప్పి బుస‌లు కొడుతూ మీదికి వ‌స్తున్న త్రాచుపామును ఈ సాహస యువతి ఎంత సునాయాసంగా ప‌ట్టిందో మ‌రి. తోకను పట్టుకున్న తరువాత కూడా పాము తన పడగను వదల్లేదు. దీంతో పగడతో వుండగానే దానిని పట్టుకోవాలని ప్రయత్నించింది.

ముందుగా పడగకు ఎదురుగా త‌న కాలు ఆడిస్తూ దాని దృష్టిని మ‌ళ్లించింది. ఆ తరువాత ప్లాస్టిక్ డబ్బాను కదుపుతూ పామును దృష్టిని మళ్లింది. డబ్బును ఒక్కటి రెండు సార్లు పాము తన కోరలతో విరుచుకుపడింది కూడా. ఆ సమయంలో పాము పడగపై ప్లాస్టిక్ డబ్బాను పెట్టి.. ఇక నడుము తోక భాగాన్ని బలవంతంగా డబ్బాలోనికి నెట్టింది. పాము వేస్తున్న కాట్లను త‌ప్పించుకుంటూ దాన్ని ప‌ట్టుకుని డ‌బ్బాలో పెట్టిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian brave girl  cobra  bare hands  naked hands  plastic box  poisonious snake  

Other Articles