Six telcos understated revenues by Rs 61,000 crore: CAG దొంగలు దొంగలు దేశాన్నే పంచుకున్నారు..

Six telcos understated revenues by rs 61 000 crore cag

CAG, Telecom operators, Telcos, comptroller and auditor general, Bharti Airtel, Vodafone India, Idea Cellular, Reliance Communications, Aircel, Sistema Shyam

Six private telecom operators including Bharti Airtel, Vodafone and Idea, understated revenues to the extent of Rs 61,064.5 crore during 2010-11 and 2014-15, which led to a "short payment" of Rs 7,697.6 crore to the government, the national auditor said in a report.

ఎయిర్ టెల్, ఐడియా సహా 6 కంపెనీలు కలసి ఇలా..

Posted: 07/22/2017 11:39 AM IST
Six telcos understated revenues by rs 61 000 crore cag

కలసి వుంటే కలదు సుఖం అన్నారు కానీ కలసి దోచుకోమ్మని ఎవరూ చెప్పరు. అయితే దొంగలు దొంగలు కలసి ఊళ్లను పంచుకున్నట్లు.. టెలికాం కంపెనీలు అన్ని కలసికట్టుగా ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెట్టాయని.. తాజా అధ్యయనాల్లో స్పష్టమైంది. వేల కోట్ల రూపాయల అదాయాన్ని తక్కువగా చూపించి.. ప్రభుత్వ ఖజానాకు కట్టాల్సిన వేల కోట్ల రూపాయల చెల్లింపులను ఎంచక్కా బొక్కేసింది. ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెలుగుచూశాయి.

దేశంలోనే ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్ల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్, సిస్టిమా శ్యామ్ సంస్థలు ఈ రకమైన మోసాలకు పాల్పడినట్లు కాగ్ గుట్టురట్టు చేసింది. 2010-11 నుంచి 2014-15 సంవత్సరాల్లో ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, ఎయిర్ సెల్ టెలికాం సంస్థలు ఈ విధమైన మోసపూరిత లెక్కలకు పాల్పడ్డారని కాగ్ తేల్చింది. కాగా సిస్టమా శ్యామ్ సంస్థ ఏకంగా 2006-07 నుంచి 2014-15 వరకు ఈ తరహా తప్పుడు లెక్కలు చూపించారని నివేదికలో కాగ్ తెలిపింది.

ఈ మేరకు కాగ్ తమ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. 1999లో అచరణలోకి తీసుకువచ్చిన న్యూ టెలికాం పాలసీ ప్రకారం కంపెనీలు అర్జించే ఆధాయాంలో కొంత శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. అయితే ఈ కొత్త పాలసీలోని లొసుగులను తమకు అసరాగా మార్చుకున్న కంపెనీలు.. తమకు వస్తున్నా ఆదాయన్ని తక్కువగా చూపించాయని కాగ్ తెలిపింది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు అన్ని కలిసి రూ.61,064.5 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించి.. ప్రభుత్వానికి సమకూరల్సిన చెల్లింపులలో రూ.7,697.60 కోట్ల తేడా ఉన్నట్లుగా కాగ్‌ తెలిపింది. ఇలా రెవెన్యూ షేర్ ను తక్కువ చేయడంతో ప్రభుత్వానికి భారీగా చెల్లింపులు తగ్గాయని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CAG  Vodafone  Telecom operators  Telcos  idea  comptroller and auditor general  Bharti Airtel  

Other Articles