అమ్మ డెత్ ఛాలెంజ్.. అపోలో రెడీ | Ready to Face Probe on Jayalalithaa's Treatment

Apollo ready for probe into jayalalithaa s death

Prathap C. Reddy, Apollo Jayalalithaa Death, Jayalalithaa Apollo Hospital, Prathap C. Reddy Tamil Nadu, Tamil Nadu Apollo Hospitals, Apollo No Interference, Jayalalithaa Death Probe, Jayalalithaa Death Mystery

Apollo Hospitals said on Tuesday there was “no interference” in the treatment given to former Tamil Nadu Chief Minister J. Jayalalithaa. Ready to any kind of inquiry Prathap C. Reddy said.

అపోలో చైర్మన్ సంచలన ప్రకటన

Posted: 07/19/2017 08:59 AM IST
Apollo ready for probe into jayalalithaa s death

అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ఛాలెంజ్ కు రెడీ అయ్యాడు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో అనుమానాలను తొలగించేందుకు రెడీ అంటూ ప్రకటించాడు. కొందరితో కుమ్మకై ఆమె చికిత్సను అత్యంత గోప్యంగా జరిపి డ్రామాలాడారంటూ ఆస్పత్రి పై ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇప్పటికే పలు దఫాలు ఆమె మృతిపై వివరణలు ఇస్తూ వస్తున్న ఆస్పత్రి మరోసారి అందుకు సిద్ధమని ప్రకటించింది.

ఆమె మృతి విషయంలో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించాడు. జయలలితకు 75 రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో చికిత్స అందించినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నట్టు తెలిపారు. జయకు చికిత్స విషయంలో ఎటువంటి రహస్యం లేదని, ఎవరి జోక్యమూ లేదని స్పష్టం చేశాడు. ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఆధారాలతోసహా ముందుకు రావాలంటూ సవాల్ విసిరాడు. తాము ఎవరో చెప్పినట్లు చికిత్స చేయాల్సిన అవసరం లేదని, దీనిని రాజకీయం చేయాల్సినంత అవసరం కూడా లేదని తాను భావిస్తున్నానని చెబుతూ ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని పేర్కొన్నాడు.

జయ మరణంపై అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని అన్ని వైపుల డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క విపక్షాలు కూడా ఈ డిమాండ్ తోనే ప్రజల్లో మార్కులు కొట్టేయాలని యత్నిస్తుండటం విశేషం. ప్రతిపక్ష డీఎంకే అయితే ఓ అడుగు ముందకేసి తాము అధికారంలోకి వస్తే ముందు ఆ మిస్టరీపైనే జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపిస్తామని ప్రకటించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apollo Hospitals  Jayalalithaa Death  Prathap C. Reddy  

Other Articles